Suriya Role in Vikram | ఇంత వరకు అలాంటి పాత్ర సూర్య చేయలేదు: లోకేశ్ కనగరాజ్-director lokesh kanagaraj revealed hero suriya role in vikram movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Lokesh Kanagaraj Revealed Hero Suriya Role In Vikram Movie

Suriya Role in Vikram | ఇంత వరకు అలాంటి పాత్ర సూర్య చేయలేదు: లోకేశ్ కనగరాజ్

Maragani Govardhan HT Telugu
May 25, 2022 10:26 AM IST

కమల్ నటించి విక్రమ్ సినిమాలో సూర్య అతిథి పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాత్ర గురించి చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెలియజేశాడు. ఇదివరకు సూర్య చేయని పాత్రలో ఆయన కనిపిస్తారని తెలిపారు.

విక్రమ్ సినిమాలో సూర్య అతిథి పాత్ర
విక్రమ్ సినిమాలో సూర్య అతిథి పాత్ర (Twitter)

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో సూర్య కూడా అతిథి పాత్రలో మెరవనున్నారు. కమల్ ఫిల్మ్మ్ ఇంటర్నేషనల్, ఉయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరో సూర్య పాత్రకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో సూర్యది అతిథి పాత్రే కాకుండా ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందట. ఈ విషయాన్ని సదరు చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వెల్లడించారు.

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన లోకేశ్.. సూర్య పాత్ర గురించి తెలియజేశారు. "ఇంతకుముందు సూర్యను చూడని పాత్రలో ఆయన కనిపించనున్నారు. మా సెట్స్‌లో ఉండటం చాలా అడ్వెంచరస్ అనుభవంగా ఆయన భావించారు." అని లోకేశ్ కనగరాజ్ అన్నారు.

ఈ చిత్రంలో కమల్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్, నారైన్, శివాని నారాయణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ చిత్రాన్ని హీరో నితిన్ ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేయనుంది. వైవిధ్య నటుడైన కమల్ హాసనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

గంగధరన్ సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఇదివరకు ఈ డైరెక్టర్ కార్తీతో ఖదీ, విజయ్‌తో మాస్టర్ చిత్రాలను తీశాడు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం గమనార్హం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్