దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన తమిళ చిత్రం కూలీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలోనే లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఓ ఫీమేల్ సూపర్ హీరో క్యారెక్టర్ ఉంటుందని పేర్కొన్నారు.
లోకేష్ కనగరాజ్ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ను సృష్టించారు. ఇది తమిళ సినిమాలో ఒక కొత్త ప్రయత్నం. ఈ యూనివర్స్‌లో ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో అనే మూడు సినిమాలు రిలీజ్ చేశారు. ఆయన అభిమానులు తదుపరి భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎల్సీయూలో పవర్ ఫుల్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు తక్కువగానే ఉన్నాయి. లోకేష్ ఇటీవల కూలీ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో బలమైన మహిళా పాత్రను పరిచయం చేసే ఆలోచన గురించి మాట్లాడారు.
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో ఎల్సీయూ కాన్సెప్ట్‌ను మరో రేంజ్ కు తీసుకెళ్లారు లోకేష్ కనగరాజ్. కూలీ రిలీజ్ తర్వాత కార్తీతో కలిసి ఖైదీ 2 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కూలీ విడుదల కోసం ఎదురు చూస్తూ రజనీకాంత్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూనే, తన ఎల్సీయూలో కొత్తగా ఏదో పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. ఎల్సీయూలో ఏజెంట్ టీనా, సత్య (లియోలో త్రిష) వంటి పాత్రలు ఉన్నప్పటికీ, ప్రధాన పాత్రలో బలమైన మహిళా పాత్ర లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.
గలాట్టా ప్లస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో లోకేష్ సమాధానమిస్తూ.. “ఎల్సీయూ యూనివర్స్‌లో కొత్తగా ఉండే 2-3 పాత్రలను స్పెషల్ గా రాస్తున్నాను. ఖైదీ 2లో మీకు అప్‌డేట్ వస్తుంది” అని చెప్పారు. అయితే ఆ పాత్రలను ఎవరు పోషిస్తారు లేదా ఆ పాత్రలు ఎలా ఉంటాయనే దాని గురించి ఆయన ఎక్కువ వివరాలు వెల్లడించలేదు.
కూలీ తరువాత లోకేష్.. ఖైదీ 2 సినిమాను కార్తీతో చేయనున్నారు. దీనితో పాటు, రాఘవ లారెన్స్, నివిన్ పౌలీ నటిస్తున్న బెంజ్ సినిమాను కూడా లోకేష్ నిర్మిస్తున్నారు. ఇది కూడా ఎల్సీయూలో భాగమే. కమల్ హాసన్‌తో విక్రమ్ 2, సూర్యతో రోలెక్స్‌పై ఒక ప్రత్యేక సినిమాను కూడా లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. వీటి తర్వాత ఎల్సీయూలోనే మరిన్ని చిత్రాలను రూపొందించే ప్లాన్ లో ఉన్నారు లోకేష్ కనగరాజ్.
సంబంధిత కథనం