Lambasingi: ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు.. నాగార్జున డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్-director kalyan krishna comments in lambasingi success meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Kalyan Krishna Comments In Lambasingi Success Meet

Lambasingi: ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు.. నాగార్జున డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 18, 2024 06:20 AM IST

Kalyan Krishna Lambasingi Success Meet: బిగ్ బాస్ దివి, భారత్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా లంబసింగి. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించిన ఈ సినిమా మార్చి 15న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో లంబసింగి సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు.. నాగార్జున డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు.. నాగార్జున డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Kalyan Krishna Lambasingi: కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

"ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు. మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాకా చాలా మంది ఉంటారు. నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను" అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు.

"నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు ఎదురుచూశాను. ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందరికి అవకాశాలు రావాలి. దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతనికి మంచి భవిషత్తు ఉండాలి" అని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు.

"నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్ఆర్ ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు. ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది. సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను" అని దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ పేర్కొన్నారు.

"ఈ కథ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు అదే బరువైన హృదయంతో బయటికి వస్తున్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన జీకె మోహన్ గారికి థాంక్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అందరూ వారి బెస్ట్ ఇచ్చారు. దివి, భారత్ చాలా ఇంటెన్స్‌తో నటించారు. మా లంబసింగి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు" అని మూవీ డైరెక్టర్ నవీన్ గాంధీ తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ.. "లంబసింగి సినిమా నాకు చాలా స్పెషల్. సాంగ్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు. కల్యాణ్ కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో చాలా నేర్చుకున్నాను" అని చెప్పారు.

IPL_Entry_Point