వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా అరి. అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు పేపర్ బాయ్ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వం వహించారు.
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన అరి మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఇంటర్వ్యూలో అరి సినీ విశేషాలను తెలిపారు చిత్ర దర్శకుడు జయశంకర్.
-మా ‘అరి’ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్‌లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
-మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.
-అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ‘అరి’ సినిమాను రూపొందించాను. ఈ కారణం వల్లే చిత్రీకరణ ఆలస్యమైంది. వీలైనంత సింపుల్‌గా ఈ సబ్జెక్ట్‌ను తెరకెక్కించాం. సెన్సార్ వాళ్లు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచింగ్‌గా మూవీ రూపొందించారని ప్రశంసించారు.
-మా మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా. ‘అరి’ లాంటి మూవీ చేయాలంటే నిర్మాతలకు అభిరుచితో పాటు ధైర్యం ఉండాలి. అలాంటి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది.
-ఇది రెగ్యులర్ మూవీ కాదు, రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. షూటింగ్‌లో కొంత బడ్జెట్ పెరిగింది. అయినా ఇప్పటికీ వారు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఏ సినిమా కూడా ప్రేక్షకులందరికీ యునానమస్‌గా నచ్చదు.
-మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.
సంబంధిత కథనం