ఉద్యోగం వదులుకుని వచ్చాను, నాలుగేళ్లకు దర్శకుడినయ్యాను.. వాటిని ఎలా జయించాలో మాత్రం చెప్పలేదు: అరి డైరెక్టర్ జయశంకర్-director jayashankar comments on ari movie and his personal life arishadvarga concept in an interview ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఉద్యోగం వదులుకుని వచ్చాను, నాలుగేళ్లకు దర్శకుడినయ్యాను.. వాటిని ఎలా జయించాలో మాత్రం చెప్పలేదు: అరి డైరెక్టర్ జయశంకర్

ఉద్యోగం వదులుకుని వచ్చాను, నాలుగేళ్లకు దర్శకుడినయ్యాను.. వాటిని ఎలా జయించాలో మాత్రం చెప్పలేదు: అరి డైరెక్టర్ జయశంకర్

Sanjiv Kumar HT Telugu

పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన జయశంకర్ లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా అరి. అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కిన అరిలో అనసూయ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా అరి సినిమా విశేషాలను దర్శకుడు జయశంకర్ తెలిపారు.

ఉద్యోగం వదులుకుని వచ్చాను, నాలుగేళ్లకు దర్శకుడినయ్యాను.. వాటిని ఎలా జయించాలో మాత్రం చెప్పలేదు: అరి డైరెక్టర్ జయశంకర్

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష , సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ సినిమా అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది దీనికి క్యాప్షన్. ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు.

అరి థియేట్రికల్ రిలీజ్

ఇదివరకు పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన జయశంకర్ చాలా కాలం గ్యాప్ తర్వాత అరి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 10న అరి మూవీ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అరి సినీ విశేషాలను డైరెక్టర్ జయశంకర్ తెలిపారు.

నాలుగేళ్లకు దర్శకుడిని

-సినిమాల మీద ప్యాషన్‌తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్‌లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు.

పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్

-నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కొవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను.

అరిషడ్వర్గాలను ఎలా జయించాలో

-నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా కూడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు.

యోగులను కలిశాను

-2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు.

సందేశాత్మకంగా కాకుండా

-అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ఈ ‘అరి’ చిత్రాన్ని రూపొందించాను. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.

స్టార్‌డమ్ రెఫ్లెక్ట్

-‘అరి’ లాంటి మూవీని స్టార్స్ కూడా చేయొచ్చు. అయితే పాత్రల కంటే వారి స్టార్‌డమ్ రెఫ్లెక్ట్ అవుతుందని పాత్రలకు సరిపోయేలా సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష .. ఇలాంటి వారిని తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి.

ఉపేంద్ర సినిమాలంటే

-సందేశం ఇవ్వాలని ఈ మూవీ రూపొందించలేదు. నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్‌గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది.

ఇలాంటి సబ్జెక్ట్‌తో రాలేదన్నారు

-‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్‌తో మూవీ రాలేదని అన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం