Rana in IIFA 2024: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’పై ఐఫా వేడుకల్లో రానా వెటకారం.. ఎన్నో విన్నానంటూ డైరెక్టర్ హరీశ్ శంకర్ కౌంటర్
Mr Bachchan Cinema Troll: రానా సాధారణంగా వివాదాలకి దూరంగా ఉంటాడు. కానీ.. ఐఫా-2024 వేడుకల్లో చాలా మంది హీరోల సినిమాలపై సరదాగా ట్రోల్ చేసిన రానా.. ఒక్కసారిగా వివాదంలో ఇరుక్కున్నాడు.
అబుదాబి వేదికగా జరిగిన ఐఫా-2024 వేడుకల్లో హీరో దగ్గుబాటి రానా చేసిన కామెంట్స్ వివాదాలకి దారితీస్తున్నాయి. హనుమాన్ ఫేం తేజ సజ్జాతో కలిసి ఈ వేడుకకి హోస్ట్‌గా వ్యవహరించిన రానా.. వేదికపై తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో అందర్నీ అలరించాడు. కానీ.. ఈ క్రమంలో కొన్ని సార్లు రానా హద్దులు దాటి కొన్ని సినిమాలపై సరదాగా ట్రోలింగ్‌కి దిగాడు.
బచ్చన్ హై.. లో..
‘‘బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై.. లోయెస్ట్ లో చూశారు’’ అని రానా అనగా.. పక్కనే ఉన్న సజ్జా ‘‘హైయెస్ట్ హై కల్కి.. మరి లోయెస్ట్ లో ఏంటి?’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. దాంతో రానా మరింత వెటకారంగా ‘‘అదే మొన్న రిలీజైంది కదా.. మిస్టర్....? ’’ అంటూ సాగదీశాడు. దాంతో సజ్జా చెప్పొద్దంటూ అడ్డుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హరీశ్ శంకర్ వరకూ చేరింది.
రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజైంది. కానీ.. అంచనాల్ని అందుకోలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రవితేజకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా.. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. మిక్కే జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందించారు.
మిస్టర్ బచ్చన్ మూవీ గురించి రానా ట్రోలింగ్ వీడియోను హరీశ్ శంకర్‌కి ట్యాగ్ చేసిన రవితేజ అభిమాని.. ‘‘మీరు రవితేజ అన్నతో మళ్లీ సినిమా తీయాలి. మేము కాలర్ ఎగురవేయాలన్నా.. మీ రిప్లై కావాలి’’ అంటూ రాసుకొచ్చాడు. దాంతో హరీశ్ శంకర్ కూడా స్పందించాడు. ‘‘ఎన్నో … విన్నాను తమ్ముడు … అందులో ఇదోటి ….. అన్ని రోజూలు ఒకేలా ఉండవు.. నాకైనా ….ఎవరికైనా’’ అంటూ హరీశ్ శంకర్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.
ఈ ఐఫా వేడుకల్లోనే పుష్ప-2 సినిమా రిలీజ్ వాయిదాలపై సెటైర్స్ వేసిన రానా.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌పై కూడా సజ్జాతో కలిసి ట్రోల్ చేశారు. అయితే.. ఇప్పటి వరకు పుష్ప-2 టీమ్, ఆదిపురుష్ టీమ్ మాత్రం ఇంకా స్పందించలేదు. కానీ.. పుష్ప-2 మూవీ రిలీజ్ డేట్‌పై ఇప్పటికే క్లారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న పుష్ప-2 సినిమా థియేటర్లలోకి రానుంది.