Ravi Teja: 25 ఏళ్ల హీరోయిన్‌తో రవితేజ అభ్యంతరకర డ్యాన్స్.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఏం చెప్పారంటే?
Harish Shankar About Mr Bachchan Sitar Song Controversy: మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార్ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. ఈ పాటలో 25 ఏళ్లున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ చేసిన ఓ బోల్డ్ స్టెప్ అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ కామెంట్స్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.
Harish Shankar Mr Bachchan Sitar Song Controversy: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి వచ్చేసింది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
వివాదంగా సితార్ సాంగ్
అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. హరీష్ శంకర్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమాను తెరకెక్కించారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి పాట పాడుకునేలా, ఎంజాయ్ చేసేలా ఉందని టాక్ వినిపించింది. కానీ, ఒక్క సితార్ సాంగ్ మాత్రం వివాదంపాలైంది.
శ్రుతిమించిన రొమాన్స్
మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటల్లో హీరోయిన్ గ్లామర్ ట్రీట్‌తోపాటు భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ స్టెప్పులు బోల్డ్‌గా, చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. అయితే, ఈ రొమాన్స్ సితార్ పాటలో కాస్తా శ్రుతిమించిందని వాదనలు వినిపిస్తున్నాయి. 56 ఏళ్లున్న రవితేజ 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ఆ రొమాంటిక్ స్టెప్పులు ఏంటని మండిపడుతున్నారు.
అభ్యంతరకరంగా స్టెప్
సితార్ సాంగ్‌లో భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‌ను రవితేజ ముందు నుంచి పట్టుకుని వేసే స్టెప్ ఒకటి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. ఆ ఫొటో చూసిన నెటిజన్స్ ఆ స్టెప్ చాలా అభ్యంతరకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ అలాంటి స్టెప్పులు ఏంటని అంటున్నారు.
డైరెక్టర్ క్లారిటీ
ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ టాక్ ఎలా ఉన్నప్పటికీ మంచి హిట్ అవుతోదంని సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ కార్యక్రమంలోనే భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన బోల్డ్ స్టెప్‌పై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.
ఆ ఆలోచన నాకూ వచ్చింది
"అది ఫస్ట్ డే షూట్ జరిగింది. అది శేఖర్ మాస్టర్ ఫస్ట్ రోజు. ఏదైనా డ్యాన్స్ మూమెంట్స్ కూల్‌గా వెళ్లిపోతే ఏ సమస్య ఉండదు. కానీ, దాన్ని ఒక ఫొటోలా, ఒక పోస్టర్‌లా చూస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే, ఆ మూమెంట్ కంపోజ్ చేసేటప్పుడే నాకు అదంతా బాగోలేదు, పెద్దగా ఎంకరేజింగ్‌గా లేదు అనే ఒక థాట్ నాకూడా వచ్చిందండి" అని హరీష్ శంకర్ చెప్పారు.
లో అయిపోతారంటూ
"కానీ, ఫస్ట్ రోజునే మాస్టర్ రాగానే ఆ మూమెంట్ వద్దు, ఈ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ లో (నిరాశపడిపోతారు) అయిపోతారు. ఆరోజు ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే పనిలో ఉన్నాను. రిహార్సల్స్ చేసినప్పుడు నాకు అనిపించింది. ఈ పార్ట్ ఈ పాటకు అవసరం లేదని అనిపించింది. కానీ, అది అలా ఫ్లోలో వెళ్లిపోయింది. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. నేను ఆ కామెంట్‌ను తీసుకున్నాను. అందుకే వివరణ ఇస్తున్నాను" అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.