Directors About Yashoda Movie: యశోద సెకాండాఫ్ క్లైమాక్స్‌లాగా ఉంటుంది.. చిత్ర దర్శకులు స్పష్టం
Directors About Yashoda Movie: యశోద సినిమాపై ఆ చిత్ర దర్శకులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా నవంబరు 11న రానున్న తరుణలో మీడియాతో ముచ్చటించిన వారు.. ఈ సినిమా సెకాండాఫ్ క్లైమాక్స్ మాదిరిగా ఉంటుందని తెలిపారు.
Directors About Yashoda Movie: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబరు 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శక ద్వయం హరి-హరీష్ తెరకెక్కించారు. సినిమా విడుదల దగ్గర పడటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఈ విషయం అర్థమవుతుంది. ఇందులో భాగంగా చిత్రబృందం కూడా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ఈ సినిమా దర్శకులు హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. యశోద గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“సమంత ఈ సినిమాలో చేస్తుందనగానే మేము ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాం. ఆమె వెంటనే ఒప్పుకుంది. ఆమె సెట్స్‌లో అందర్నీ ప్రోత్సహించడంతో మేమింకా అదనంగా పనిచేసేలా చేసింది. ఆమె ఎప్పుడు స్క్రిప్టుపైనే దృష్టిపెట్టేది. అలాగే మాపై గొప్పనమ్మకంతో నటించింది. యశోద ఓ ఎమోషనల్ జర్నీ. చాలా లేయర్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుంది. సెకండాఫ్ మొత్తం క్లైమాక్స్ మాదిరిగా ఉంటుంది. ఆడియెన్స్‌ను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తుంది.” అని యశోద దర్శక ద్వయం హరి-హరీష్ చెప్పారు.
"యశోద చిత్రం క్లిష్టమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించినట్లు దర్శకులు చెప్పారు. ఈ సినిమా ఎంతో విచిత్రమైన, క్లిష్టమైన స్క్రీన్‌ప్లేతో వస్తుంది. సమంతా లాంటి స్టార్ పర్ఫార్మర్‌ను సరోగసి మదర్ పాత్రలో చూడటం ప్రేక్షకులకు గూస్ బంప్స్‌ను ఇస్తుంది. ఫైనల్ కాపీని మేము ఇప్పటికే చూశాం. బాగా ఇంప్రెస్ అయ్యాం." అని వారు చెప్పారు.
సమంత ప్రధాన పాత్ర పోషించిన యశోద చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హరి-హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
సంబంధిత కథనం