OTT: మంచి ఓటీటీ మూవీలా ఆకట్టుకుంటుంది.. బాలకృష్ణ NBK109 డైరెక్టర్ బాబీ-director bobby releases revu movie first look director bobby comments on ott movies and says revu is like good ott film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: మంచి ఓటీటీ మూవీలా ఆకట్టుకుంటుంది.. బాలకృష్ణ Nbk109 డైరెక్టర్ బాబీ

OTT: మంచి ఓటీటీ మూవీలా ఆకట్టుకుంటుంది.. బాలకృష్ణ NBK109 డైరెక్టర్ బాబీ

Sanjiv Kumar HT Telugu
Published Jul 16, 2024 10:14 AM IST

Director Bobby Kolli About Revu Movie: బాలకృష్ణ ఎన్‌బీకే 109 సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్ర రేవు మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవు మూవీ మంచి ఓటీటీ సినిమాలా ఆకట్టుకుంటుందని తెలిపారు.

మంచి ఓటీటీ మూవీలా ఆకట్టుకుంటుంది.. బాలకృష్ణ NBK109 డైరెక్టర్ బాబీ
మంచి ఓటీటీ మూవీలా ఆకట్టుకుంటుంది.. బాలకృష్ణ NBK109 డైరెక్టర్ బాబీ

KS Ravindra OTT Movies Revu Film: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అ‌వుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. "రేవు సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా ప్రమోషన్‌లో జర్నలిస్ట్‌లు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ప్రభు గారు నాకు చాలా కాలంగా పరిచయం. నేను శ్రీహరి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి ప్రభు గారు తెలుసు. డైరెక్టర్‌గా నన్ను ముందు నుంచీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ప్రభు గారు" అని తెలిపారు.

"పర్వతనేని రాంబాబు గారు కూడా నాకు మంచి మిత్రులు. వీరిద్దరు కలిసి మరో మిత్రుడు మురళీ గింజుపల్లి గారితో కలిసి రేవు సినిమా చేస్తున్నారు. నేను ఈ సినిమా విజువల్స్ చూశాను. చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చూపించారు. ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కొత్త వారు చేశారు" అని డైరెక్టర్ బాబీ చెప్పారు.

"యంగ్ టీమ్ అంతా కలిసి ఈ సినిమాకు పనిచేయడం నన్ను ఆకట్టుకుంది. ఇంతమంది కొత్త వాళ్లకు రేవు సినిమాలో అవకాశం ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఓటీటీలో మనం ఏదైనా మంచి కంటెంట్ మూవీ వస్తే చూస్తాం కదా. అలా రేవు సినిమా ఆకట్టుకుంటుంది. టీమ్‌లోని ప్రతి ఒక్కరికి రేవు సినిమా మంచి పేరు తీసుకురావాలి. అలాగే నిర్మాతకు డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నా" అని డైరెక్టర్ కేఎస్ రవీంద్ర ఆకాంక్షించారు.

కాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో (Balakrishna) మూవీ తెరకెక్కిస్తున్నారు. ఎన్‌బీకే109 (NBK109) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇదిలా ఉంటే, రేవు సినిమా గురించి, డైరెక్టర్ బాబీపై జర్నలిస్ట్ ప్రభు కామెంట్స్ చేశారు. "మా రేవు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారికి థాంక్స్ చెబుతున్నా. ఆయన ఎన్‌బీకే 109 సినిమా భారీ షెడ్యూల్ కోసం ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు" అని జర్నలిస్ట్ ప్రభు తెలిపారు.

 

Whats_app_banner