Bobby Kolli: చిరంజీవి అభిమానినని చెప్పినా కూడా బాలకృష్ణ ప్రోత్సహించారు, అబద్ధాలకు చోటు లేదు: డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ-director bobby kolli comments on balakrishna in daaku maharaaj success event and says he encouraged i am chiranjeevi fan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bobby Kolli: చిరంజీవి అభిమానినని చెప్పినా కూడా బాలకృష్ణ ప్రోత్సహించారు, అబద్ధాలకు చోటు లేదు: డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ

Bobby Kolli: చిరంజీవి అభిమానినని చెప్పినా కూడా బాలకృష్ణ ప్రోత్సహించారు, అబద్ధాలకు చోటు లేదు: డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ

Sanjiv Kumar HT Telugu
Jan 23, 2025 12:31 PM IST

Daaku Maharaaj Director Bobby Kolli About Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి. తాజాగా అనంతపురంలో నిర్వహించిన డాకు మహారాజ్ విజయోత్సవ పండుగలో దర్శకుడు బాబీ కొల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చిరంజీవి అభిమానినని చెప్పినా కూడా బాలకృష్ణ ప్రోత్సహించారు, అబద్ధాలకు చోటు లేదు: డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ
చిరంజీవి అభిమానినని చెప్పినా కూడా బాలకృష్ణ ప్రోత్సహించారు, అబద్ధాలకు చోటు లేదు: డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ

Daaku Maharaaj Director Bobby Kolli Balakrishna: గతేడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ ఈ సంవత్సరం సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ డియోల్ విలన్‌గా నటించిన ఈ మూవీ కలెక్షన్లతో అదరగొడుతోంది.

బాబీ కొల్లి కామెంట్స్

ఈ నేపథ్యంలో జనవరి 22న ఏపీలోని అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవ సభ పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబీ కొల్లి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

"అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. రాయలసీమ బాలకృష్ణ గారి అడ్డా. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్‌కి రావడం సంతోషంగా ఉంది" అని బాబీ కొల్లి అన్నారు.

నిజాయితీగా ఉంటే ఇష్టం

"నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అయినప్పటికీ నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు. నేను చిరంజీవి గారి అభిమానిని అని చెప్పినా కూడా బాలకృష్ణ గారు నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలకృష్ణ గారి దగ్గర చోటు లేదు" అని డైరెక్టర్ బాబీ కొల్లి తెలిపారు.

"మా నాన్న గారు మరణించక ముందు నేను బాలకృష్ణ గారిని కలిసి ఉంటే మా నాన్న నాకు ఇంకా బాగా అర్ధమయ్యేవారు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఇలాగే ప్యూర్ హార్ట్‌తో ఉంటారు. ప్రేమైనా కోపమైనా అప్పుడే చూపిస్తారు. ఒకప్పుడు నాకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు. కానీ, దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది" అని బాబీ కొల్లి పేర్కొన్నారు.

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా

"సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్‌లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. నా డైరెక్షన్ టీమ్‌కి, రైటింగ్ టీమ్‌కి పేరుపేరునా కృతఙ్ఞతలు. విజయ్ కార్తీక్ గారు విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అవినాష్ కొల్లా గారి లాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది" అని బాబీ కొల్లి చెప్పుకొచ్చారు.

"తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గారు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారని విన్నాను. కావేరి, నందిని పాత్రలకు ప్రాణం పోసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌కి థాంక్స్. వేద అగర్వాల్‌కి మంచి భవిష్యత్ ఉంది. నేను అభిమానిని కాదు, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఫాలోవర్‌ని అయిపోయాను" అని డాకు మహారాజ్ దర్శకుడు బాబీ కొల్లి వెల్లడించారు.

డాకు మహారాజ్‌ను మించిన సినిమా

"హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే.. నిర్మాత నాగవంశీ గారి వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్‌లో బాలకృష్ణ గారితో డాకు మహారాజ్‌ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను" అని బాబీ కొల్లి తన స్పీచ్ ముగించారు.

Whats_app_banner

సంబంధిత కథనం