Bobby Deol: భార్య డబ్బులతో బతికాను, కొడుకు మాట విని చచ్చిపోవాలనిపించిందన్నాడు- యానిమల్ విలన్‌పై బాలయ్య డైరెక్టర్ బాబీ
Director Bobby Kolli About Animal Actor Bobby Deol: బాలకృష్ణ డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి యానిమల్ విలన్ బాబీ డియోల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. యానిమల్ కంటే సినిమా ముందు తన పరిస్థితి ఎలా ఉందో తనతో బాబీ డియోల్ చెప్పుకున్నట్లు దర్శకుడు బాబీ కొల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Daaku Maharaaj Director Bobby Kolli About Bobby Deol: యానిమల్ సినిమాతో విలన్‌గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్. ఎంతలా అంటే, బాబీ డియోల్ కెరీర్‌ను యానిమల్‌కు ముందు, ఆ తర్వాత అనేలా పేరు వచ్చింది.

యానిమల్ తర్వాత
యానిమల్ మూవీ కంటే ముందు చాలా ఏళ్లు ఎలాంటి సినిమా ఆఫర్స్ లేకుండా జీవితం గడిపినట్లు బాబీ డియోల్ ఇదివరకే పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే తనకు బ్రేక్ ఇచ్చాడని, ఆయన విషయంలో ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని బాబీ డియోల్ తెలిపారు. అయితే, యానిమల్ తర్వాత బాబీ డియోల్‌కు వరుసగా సినీ ఆఫర్స్ రావడం ప్రారంభమైంది.
యానిమల్ తర్వాతే సూర్య కంగువా మూవీలో విలన్‌గా చేశాడు బాబీ డియోల్. అంతేకాకుండా ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో కూడా ప్రతినాయుడిగా అలరించాడు బాబీ డియోల్. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.
బాబీ కొల్లి కామెంట్స్
అయితే, డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బాలయ్యకు విలన్‌గా నటించిన బాబీ డియోల్ జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు డైరెక్టర్ బాబీ కొల్లి. ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"ఇప్పుడు బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. అంటే మనం టచ్ చేస్తేనే ఏడ్చేస్తున్నాడు. నా లైఫ్ నేను ఇలా ఊహించుకోలేదు బాబీ అంటున్నాడు. అంటే, దాదాపుగా 15 ఏళ్లు నేను ఇంట్లో కూర్చున్నాను. నా భార్య డబ్బుల మీద బతికాను" అని డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పారు.
తల్లితో కొడుకు మాట్లాడింది
"నా పిల్లాడు ఓ రోజు అంటుంటే పక్క రూమ్‌లో నుంచి విని నాకు చచ్చిపోవాలనిపించింది. నాన్న ఇక పని చేయడా అమ్మా అని ఒక కొడుకు తన తల్లితో మాట్లాడుతున్న మాట విన్నాడట. అంటే వాడు చూడలేదు. వాళ్ల తండ్రి ఒకప్పుడు సూపర్ స్టార్. అప్పుడు వాడు పుట్టలేదు. కానీ, వాడికి ఒక ఏజ్ వచ్చేసరికి నాన్న ఇంట్లో కూర్చుంటున్నాడు" అని బాబీ కొల్లి అన్నారు.
"కాబట్టి, అతను నేనేందుకు బయటకు వెళ్లలేకపోతున్నాను. అందరి ఆఫీస్‌లకు, ప్రొడ్యూసర్స్‌కి తన ఫొటోలు పంపించేవాడంట. మళ్లీ కృష్ణ గారిలాగే. ప్రతి ఒక్కరు సూపర్, బాబీ లుక్స్ చాలా బాగున్నాయి. మనం పని చేద్దాం అనేవారట. కానీ ఎవరు పిలిచేవారు కాదంట. కానీ, మీ తెలుగోడు ఒక్కడు వచ్చి సందీప్ రెడ్డి వంగా నా జీవితాన్ని మార్చాడు బాబీ. అంటాడు, సందీప్ రెడ్డి వంగా పేరు చెబితేనే ఎమోషన్ అయిపోతుంటాడు" అని బాబీ కొల్లి తెలిపారు.
డిమాండ్ చేసినంత డబ్బులు
"యానిమల్ తర్వాత తను చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు డబ్బులు తను డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రెడీ, అన్ని భాషల డైరెక్టర్స్ రెడీ. ఏమాత్రం తనకు కంఫర్ట్ జోన్, తనకు కిక్ రాకుంటే క్యారెక్టర్ చేయడు" అని బాబీ డియోల్ అన్న మాటల గురించి డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్