Sankranthiki Vasthunam: బ్లాక్‍బస్టర్ అయినా.. సినిమాలో లోటును అంగీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి-director anil ravipudi tells about his mistake regarding sankranthiki vasthunam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthiki Vasthunam: బ్లాక్‍బస్టర్ అయినా.. సినిమాలో లోటును అంగీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి

Sankranthiki Vasthunam: బ్లాక్‍బస్టర్ అయినా.. సినిమాలో లోటును అంగీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2025 10:09 AM IST

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బంపర్ హిట్ అయింది. అయితే, ఈ చిత్రం విషయంలో తాను చేసిన పొరపాటును దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఎలా చేసి ఉంటే మరింత బాగుండేదో అంగీకరించారు. ఆ వివరాలివే..

Sankranthiki Vasthunam: బ్లాక్‍బస్టర్ అయినా.. సినిమాలో లోటును అంగీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి 
Sankranthiki Vasthunam: బ్లాక్‍బస్టర్ అయినా.. సినిమాలో లోటును అంగీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి 

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అంచనాలకు మించి భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఏకంగా రూ.276 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి ఊహించనంత హిట్ కొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో ఆరంభం నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. అయితే, తాను కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ మూవీ మరింత బాగుండేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చెప్పారు. ఏమన్నారంటే..

yearly horoscope entry point

సెకండాఫ్‍లో కామెడీ లోటు

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సెకండాఫ్‍లో కామెడీ లోటుగా అనిపించిందని అనిల్ రావిపూడి అంగీకరించారు. మరింత కామెడీ సీన్లు ఉండాల్సిందని చెప్పారు. భరద్వాజ్ రంజన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను అనిల్ పంచుకున్నారు.

ఈ చిత్రం సెకండాఫ్‍లో కామెడీని ఎక్కువగా ఉండటంలో మిస్ అయ్యానని అనిల్ చెప్పారు. సెకండాఫ్‍లో బుల్లినాయుడు పాత్రను ఎక్కువగా వాడుకోవాల్సిందని, స్కోప్ ఉన్నా అలా చేయలేకపోయానని అనిల్ చెప్పారు. ఇలా చేసి ఉంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరింత మెరుగ్గా ఉండేదని అన్నారు. భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే వెంకటేశ్ ఫ్రస్ట్రేషన్‍పైనే తాను ఎక్కువగా దృష్టి పెట్టానని అనిల్ తెలిపారు.

ప్రేక్షకుల ఫీలింగ్ కూడా ఇదే

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఫస్టాఫ్ ఫన్ బాగా జనరేట్ అయింది. కామెడీతో నవ్వించేసింది. అయితే, సెకండాఫ్‍లో కిడ్నాప్, ఛేజ్‍లు, టెర్రరిస్టులు అంటూ కథ ఎటెటో వెళుతుంది. ఫస్టాఫ్‍తో పోలిస్తే సెకండాఫ్‍లో ఫన్ బాగా తగ్గింది. చాలా మంది ప్రేక్షకుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సినిమాను ఓవరాల్‍గా పరిగణనలోకి తీసుకుంటే మంచి ఎంటర్‌టైన్‍మెంట్ పంచిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా ఈ ఫ్యామిలీ మూవీతో అనిల్ రావిపూడి మరో బ్లాక్‍బస్టర్ అయితే కొట్టేశారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయాల మేరకు.. సినిమాలో లోటేంటో కూడా ఒప్పేసుకున్నారు.

రూ.300కోట్ల దిశగా..

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.276 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. ఇంకా థియేట్రికల్ రన్ బాగానే ఉంది. దీంతో రూ.300 కోట్లు మార్క్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీకి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఆశ్చర్యపరిచింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన రీజనల్ సినిమా రికార్డు సృష్టిందని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ చిత్రం ముందు వరకు వెంకటేశ్‍కు రూ.150కోట్ల మార్క్ లేదు. అయితే, ఈ సినిమాతో ఆయన రూ.300కోట్ల క్లబ్‍లో చేరనున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వైడీ రాజు పాత్రలో వెంకటేశ్ ఫుల్ జోష్, ఫన్‍తో అదరగొట్టారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మురళీధర్ గౌడ్, మాస్టర్ రేవంత్, శ్రీనివాసరెడ్డి, సాయికుమార్, శ్రీనివాస్ అవసరాల, నరేశ్ కీలకపాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. భీమ్ సెసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మూవీ హిట్‍లో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయి.

Whats_app_banner

సంబంధిత కథనం