Anil Ravipudi: మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకు వచ్చిందని ఫొటో పెట్టాడు, ఆ హీరోనే దర్శకుడిగా నిలబెట్టారు: అనిల్ రావిపూడి-director anil ravipudi completes 10 years film journey and comments on sankranthiki vasthunnam success hero kalyan ram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Ravipudi: మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకు వచ్చిందని ఫొటో పెట్టాడు, ఆ హీరోనే దర్శకుడిగా నిలబెట్టారు: అనిల్ రావిపూడి

Anil Ravipudi: మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకు వచ్చిందని ఫొటో పెట్టాడు, ఆ హీరోనే దర్శకుడిగా నిలబెట్టారు: అనిల్ రావిపూడి

Sanjiv Kumar HT Telugu
Jan 23, 2025 10:31 AM IST

Anil Ravipudi About Sankranthiki Vasthunnam Movie: డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా జనవరి 23 అంటే నేటితో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్‌గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు.

మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకు వచ్చిందని ఫొటో పెట్టాడు, ఆ హీరోనే దర్శకుడిగా నిలబెట్టారు: అనిల్ రావిపూడి
మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకు వచ్చిందని ఫొటో పెట్టాడు, ఆ హీరోనే దర్శకుడిగా నిలబెట్టారు: అనిల్ రావిపూడి

Anil Ravipudi About 10 Years Of Film Journey: 'ఈ పదేళ్లు ప్రతి సినిమా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌గా ఈ పొంగల్‌కి 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు.

yearly horoscope entry point

'సంక్రాంతికి వస్తున్నాం' విక్టరీ నా కెరీర్‌లో ఓ హిస్టరీ' అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి జనవరి 23తో పదేళ్లు. ఈ సందర్భంగా విలేకరుల సమవేశంలో ముచ్చటించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

దర్శకుడిగా ఈ పదేళ్ల జర్నీ ఎలా అనిపించింది ? ఎలాంటి హైస్, లోస్ చూశారు?

-లక్కీగా ఆడియన్స్ సపోర్ట్‌తో అన్నీ హైసే చూశాను. ఈ పదేళ్లలో చేసిన ప్రతి సినిమా ఒక ఎక్స్‌పీరియన్స్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌గా ఈ పొంగల్ కి 'సంక్రాంతికి వస్తున్నాం'తో అద్భుతమైన విజయం ఇచ్చారు. ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్‌కే ఇస్తాను.

-'సంక్రాంతికి వస్తున్నాం' మామూలు సక్సెస్ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్, వన్ వీక్‌లో 200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్‌లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఈ బలం ఉందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది.

మీరు కెరీర్ మొదలుపెట్టినప్పుడు అనుకున్న గోల్‌కి రీచ్ అయ్యారా?

-డైరెక్టర్ కావడం నా డ్రీమ్. అది 'పటాస్'తో తీరిపోయింది. ఇదంతా బోనస్‌గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ఆడియన్స్. వారికి పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. అదే చేసుకుంటూ వస్తున్నాను.

-ఈ పదేళ్లలో ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. కల్యాణ్ రామ్ గారు లేకపొతే నా కెరియర్ లేదు. ఆయన ప్రొడ్యూస్ చేసి నన్ను డైరెక్టర్‌గా నిలబెట్టారు. ఈ పదేళ్ల క్రెడిట్ ముందు కళ్యాణ్ రామ్ గారికి ఇస్తాను. తర్వాత సాయి ధరమ్ తేజ్ గారితో సుప్రీమ్, రవితేజ గారితో రాజా ది గ్రేట్, వెంకటేష్ గారితో ఎఫ్2, సూపర్ స్టార్ మహేష్ గారితో సరిలేరు నీకెవ్వరు, మళ్లీ వెంకీ గారితో ఎఫ్3, బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి మళ్లీ వెంకీ గారితో సంక్రాంతికి వస్తున్నాము.. ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్.

-'సంక్రాంతికి వస్తున్నాం'కు వస్తున్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలౌతున్నాను. 'మా అమ్మ ముప్పై ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది' అని ఓ ఫ్రెండ్ ఫోటో షేర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. కొంతమంది వీల్ చైర్‌లో వచ్చీ మరి సినిమా చూశారు. సినిమాకి దూరమైన ఆడియన్స్ మళ్లీ థియేటర్‌కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

-ఇది ఫ్యామిలీ జోనర్‌కి ఉన్న బలం. ఫ్యామిలీ జోనర్ నా స్ట్రెంత్. ఈ జోనర్‌లో సినిమా చేసినప్పుడు ఇంకాస్త కాన్ఫిడెంట్‌గా అల్లరి చేస్తూ మంచిగా తీస్తాను (నవ్వుతూ). ఎంటర్‌టైన్మెంట్ ఆడియన్స్ నాకు ఇచ్చిన వెపన్. దాన్ని లైఫ్ లైన్‌గా ఎప్పుడూ వాడుకుంటాను.

Whats_app_banner