Anil Ravipudi: ఫస్ట్ టైమ్ ఉదయం నాలుగున్నర షోలకి ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లారు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్
Director Anil Ravipudi On Sankranthiki Vasthunnam Success: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ విశేషాల్లోకి వెళితే..!
Director Anil Ravipudi On Sankranthiki Vasthunnam Success: డైరెక్టర్ అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో బ్లాక్ బస్టర్ సంగీతం అందించారు.

సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్
పొంగల్ కానుకగా జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 77 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల్లో వంద కోట్ల కొల్లగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇటీవల సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్
సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "బెసికల్లీ, టెక్నికల్లీ, కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్ (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ థాంక్స్. బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైమ్ ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ మాకు" అని అన్నారు.
వెంకీ సార్ పొంగల్
"థియేటర్‌లో ప్యాక్డ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. పండగ రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెంకటేష్ గారికి ఫ్యామిలీస్‌లో ఉన్న ఫుల్ ఏమిటో మనందరికీ తెలుసు. ఈసారి కరెక్ట్‌గా పొంగల్ కి కుదిరింది. ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.
ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అఫ్ యూ. ఈ సంక్రాంతి మా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్, ఫ్యాన్స్‌కి మనస్పూర్తిగా థాంక్ యూ. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం డిఫరెంట్ కైండ్ అఫ్ ఎమోషన్" అని అన్నారు.
జెన్యూన్‌గా ఉన్నాయి
"సినిమాకి ప్రతి థియేటర్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్‌గా ఉన్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది" అని వెంకటేష్ తెలిపారు.
బిగ్ బ్లాక్ బస్టర్
"అనిల్ నా కెరీర్‌లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది తన కెరీర్‌లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్‌కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ చాలా థాంక్స్" అని హీరో వెంకటేష్ తన స్పీచ్ ముగించారు.