Anil Ravipudi About Katha Sudha OTT Release ETV Win: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో మెగా157 సినిమాను రూపొందించనున్నారు. తాజాగా (ఇవాళ మార్చి 30) ఉగాది సందర్భంగా మెగా157 మూవీ లాంచ్ అయింది.
ఇదిలా ఉంటే, మార్చి 29న కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ లాంచ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈటీవీ విన్‌లో ఏప్రిల్ 6న ఓటీటీ రిలీజ్ కానున్న కథా సుధ ప్రెస్ మీట్ లాంచ్‌కు హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ యాప్ పెట్టిన కొత్తలో అందులో ఏం కంటెంట్ ఉందా అని చూశా. నా చిన్నప్పటినుంచి చూసిన సినిమాలు మొత్తం ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఓటీటీల హవా కొనసాగుతున్న సమయంలో వీళ్లెలా ముందుకు తీసుకెళ్తారా అనుకున్నా. కానీ, ప్రారంభమైన ఏడాదిలో ఈటీవీ విన్ తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది" అని అన్నారు.
"ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే.. కేవలం ఆరోగ్యకరమైన, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ హెల్ది కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది. అలా తీర్చిదిద్దిన ఓటీటీ టీమ్‌ను ప్రశంసిస్తున్నా. కథాసుధ చాలా గొప్ప ఆలోచన. కొత్త ఐడియా. కథా సుధ బాగుంది. మంచి కథలు, కొత్త ప్రతిభను తీసుకురావడానికి ఇది మంచి వేదిక" అని అనిల్ రావిపూడి తెలిపారు.
"స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్‌కి వెళ్లాలని డ్రీమ్ అందరికీ ఉంటుంది. కానీ, బిగ్ స్క్రీన్‌లో అద్భుతమైనటువంటి మరపురాని చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు కొత్త ప్రతి పని ప్రోత్సహించడానికి ముందుకు రావడం నాకు చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి" అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
"ఏడు, ఎనిమిది సినిమాలు తీసి హిట్ కొట్టడం కాదు. ఇంకా ఎన్నో నేర్చుకోవాలనిపించింది. సినిమా నుంచి ఎంతైనా, ఏదైనా నేర్చుకోవచ్చు. హిట్ రాగానే అన్నీ తెలిసిపోవడం కాదు. రోజూ ఒక కొత్త పాఠం చెబుతుంది. యువకులతో పోటీ పడాలన్న రాఘవేంద్రరావు గారికి హాట్యాఫ్" అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
"కథను ఒక వ్యాక్యంలో చెప్పగలిగితే.. అది అందరికీ అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్. ఎంత చిన్న కథ చెప్పినా దాని లోతు తెలిస్తే హిద్ద హిట్. కలలో వచ్చిన స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనేది పెళ్లి సందడి. తన సంసారాన్ని ఒక సాదాసీదా మెకానిక్ ఎలా సాఫీగా నడిపించాడు అది ఘరానా మొగుడు. ప్రతి కథను ఎంత సింపుల్‌గా చెబితే అంత పెద్ద హిట్ అవుతుంది" అని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు.
"20 నిమిషాల్లో ఒక చక్కని కథని ఎంతోమంది మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌తో చేసేలా ప్రోత్సహిస్తున్న రాఘవేంద్ర రావు గారికి, సతీష్ గారికి నా బెస్ట్ విషెస్. ఈ ప్రాజెక్టుకి పనిచేస్తున్న అందరి డ్రీమ్స్ ఫుల్ ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. కథా సుధ మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం
టాపిక్