OTT Comedy: ఈ వారమే ఓటీటీలోకి కోలీవుడ్ కామెడీ మూవీ - అమెరికా అమ్మాయితో ఇండియన్ అబ్బాయి పెళ్లి జరిగితే...
OTT Comedy:శ్రీరామ్ హీరోగా నటించిన తమిళ మూవీ దినసరి ఈ వారమే ఓటీటీలోకి రానుంది. టెంట్‌కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. సింథియా లార్డ్ హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు.
శ్రీరామ్ హీరోగా నటించిన తమిళ మూవీ దినసరి ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ టెంట్ కోట ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
సింథియా హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్..
శ్రీరామ్ హీరోగా నటించిన ఈ మూవీలో సింథియా లౌర్డ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్‌గా కూడా సింథియా వ్యవహరించింది. జి శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. వినోదిని, ప్రేమ్‌జీ కీలక పాత్రలు పోషించారు.
పాజిటివ్ టాక్...
థియేటర్లలో దినసరి మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్‌తో పాటు నాయకానాయికల కెమిస్ట్రీ, ఇళయరాజా మ్యూజిక్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమాకు మ్యూజిక్‌తో పాటు లిరిక్స్‌ను ఇళయరాజా అందించారు.
పెళ్లి విషయంలో యువతలో ఎలాంటి అభిప్రాయాలు ఉంటున్నాయి? ఆలుమగలు ఇరువురు ఉద్యోగం చేయడం అవసరమేనా అనే అంశాలను వినోదాత్మకంగా ఈ మూవీలో చూపించాడు దర్శకుడు.
ఎన్ఆర్ఐతో పెళ్లి...
శక్తివేల్ మిడిల్‌క్లాస్ యువకుడు. పెళ్లి విషయంలో అతడికంటూ కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. శక్తివేల్ పెట్టే కండీషన్స్ వల్ల వచ్చిన సంబంధాలు అన్ని చెడిపోతుంటాయి.శివాని అనే ఎన్ఆర్ఐ అమ్మాయి శక్తివేల్‌ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. పెళ్లి తర్వాత శివానిని జాబ్ చేయమని అంటాడు శక్తివేల్.
కానీ ఇంటిపట్టునే ఉంటూ భర్త బాగోగులు చూసుకుంటానని శివాని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? శివాని నిర్ణయాన్ని శక్తి అంగీకరించాడా? అతడి లైఫ్ రిస్క్‌లో ఎలా పడింది? భార్య సహాయంతో ఈ సమస్య నుంచి ఎలా గట్టక్కాడు అన్నదే ఈ మూవీ కథ.మనసెల్లం, ఒరు నాల్ ఒరు కనువు తర్వాత ఇళయరాజా, శ్రీరామ్ కాంబోలో వచ్చిన మూడో మూవీ ఇది.
తెలుగులో శ్రీరామ్...తమిళంలో శ్రీకాంత్...
శ్రీరామ్ తమిళంలో శ్రీకాంత్ పేరుతో సినిమాలు చేస్తోన్నాడు. తెలుగు తమిళ భాషల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు విజయవంతమైన సినిమాలు చేశాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, టెన్త్ క్లాస్ డైరీస్, పిండతో పాటు పలు సినిమాలు చేశాడు.
హరికథ, రెక్కీ అనే వెబ్‌సిరీస్‌లలో నటించాడు. తమిళంలో ఈ ఏడాది దినసరితో పాటు శ్రీకాంత్ హీరోగా నటించిన కొంజెం కాదల్ కొంజెం మొదల్ రిలీజైంది. ఈ మూవీలో తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడా హీరోయిన్‌గా నటించింది.
సంబంధిత కథనం