Romantic Action OTT: రెండు ఓటీటీలలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT: కిరణ్ అబ్బవరం దిల్‌రుబా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీతో పాటు ఈటీవీ విన్ సొంతం చేసుకున్నాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి రెండు ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ దిల్‌రుబా ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీతో పాటు ఈటీవీ విన్ సొంతం చేసుకున్నాయి. ఏప్రిల్ 25 నుంచి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు హీరోయిన్లు...
దిల్‌రుబా మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరానికి జోడీగా రుక్సర్ థిల్లాన్, కాథీ డేవిసన్ హీరోయిన్లుగా నటించారు.
క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, క్యారెక్టరైజేషన్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే మాటలు వినిపించాయి.
సిద్ధు లవ్ ఫెయిల్యూర్...
సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (కిరణ్ అబ్బవరం) లవ్‌లో ఫెయిలవుతాడు. ప్రాణంగా ప్రేమించిన మ్యాగీ అతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఓ స్నేహితుడి చేతిలో సిద్ధు తండ్రి దారుణంగా మోసపోతాడు దాంతో ఎవరికి సారీ, థాంక్యూ చెప్పకూడదని ఫిక్సవుతాడు సిద్ధు. తన జీవితంలో ప్రేమ అన్న పదానికి చోటు లేకుండా బతకేయాలని నిర్ణయించుకుంటాడు.
అలాంటి టైమ్‌లోనే సిద్ధు జీవితంలోకి అంజలి (రుక్సర్ థిల్లాన్) వస్తుంది. ప్రేమించమని వెంటపడుతుంది. తొలుత అంజలి ప్రేమను తిరస్కరించిన సిద్ధు ఆ తర్వాత అమెకు ఫ్లాటైపోతాడు. కాలేజీలో జరిగిన ఓ గొడవ కారణంగా సారీ అనే చిన్న మాట చెప్పడానికి సిద్ధు ఒప్పుకోకపోవడంతో అంజలి కూడా అతడికి దూరమవుతుంది.
అదే టైమ్‌లో సిద్ధార్థ్‌ను వెతుక్కుంటూ అతడి మాజీ ప్రియురాలు మ్యాగీ అమెరికా నుంచి ఇండియా వస్తుంది. సిద్ధు, అంజలి విడిపోవడానికి కారణం ఏమిటి? సిద్ధును కాదని మరో పెళ్లి చేసుకున్న మ్యాగీ మళ్లీ అతడిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చింది? జోకర్ (జాన్ విజయ్), విక్కీలతో సిద్ధుకు ఉన్న గొడవలు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అన్నదే దిల్ రుబా కథ.
యాభై కోట్ల కలెక్షన్స్...
దిల్‌రుబా మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. దిల్‌రుబా కంటే ముందే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన క మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దిల్‌రుబా తర్వాత కే ర్యాంప్ పేరుతో ఓ మూవీని అనౌన్స్ చేశాడు కిరణ్ అబ్బవరం. క మూవీకి సీక్వెల్ కూడా చేయబోతున్నాడు.
సంబంధిత కథనం