Dilruba Collection: దిల్‌రూబాకు తొలిరోజు ఘోరమైన కలెక్షన్స్- రష్మిక మందన్నా, నాని చిత్రాల ప్రభావం- గత సినిమాల కంటే తక్కువ-dilruba box office collection day 1 less than kiran abbavaram past movies nani court rashmika mandanna chhaava effect ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dilruba Collection: దిల్‌రూబాకు తొలిరోజు ఘోరమైన కలెక్షన్స్- రష్మిక మందన్నా, నాని చిత్రాల ప్రభావం- గత సినిమాల కంటే తక్కువ

Dilruba Collection: దిల్‌రూబాకు తొలిరోజు ఘోరమైన కలెక్షన్స్- రష్మిక మందన్నా, నాని చిత్రాల ప్రభావం- గత సినిమాల కంటే తక్కువ

Sanjiv Kumar HT Telugu

Dilruba Worldwide Box Office Collection Day 1: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా దిల్‌రూబా. తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దిల్‌రూబా మార్చి 14న విడుదలై మంచి రెస్పాన్సే అందుకుంటోంది. ఈ నేపథ్యంలో దిల్‌రూబా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

దిల్‌రూబాకు తొలిరోజు ఘోరమైన కలెక్షన్స్- రష్మిక మందన్నా, నాని చిత్రాల ప్రభావం- గత సినిమాల కంటే తక్కువ

Dilruba Day 1 Box Office Collection: తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్‌రూబా. టాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన దిల్‌రూబా హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో దిల్‌రూబా డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

9 వేల టికెట్స్ సేల్

దిల్‌రూబా సినిమాకు ఇండియాలో మొదటి రోజున రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అయితే, ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, ఊహించిన రేంజ్‌లో బుకింగ్స్, కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది. దిల్‌రూబా సినిమాకు తొలి రోజున 9 వేల రేంజ్‌లో టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.

హిందీ చిత్రానికి ఎక్కువ

కానీ, అదే సమయంలో తెలుగు డబ్బింగ్ హిందీ మూవీ ఛావాకు 8వ రోజున 14 వేల లోపు టికెట్స్ సేల్ అవ్వడం విశేషంగా మారింది. అంటే, కిరణ్ అబ్బవరం దిల్‌రూబా కంటే రష్మిక మందన్నా హిందీ చిత్రానికి టికెట్స్ ఎక్కువ సేల్ అయి కలెక్షన్స్ అధికంగా ఉన్నాయి. ఇకపోతే ఓపెనింగ్స్ పరంగా హోలీ ఫెస్టివల్ హాలీడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ దిల్‌రూబా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు.

రెండు, మూడు రోజుల ముందే

దిల్‌రూబా సినిమా రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 2, 3 రోజుల ముందే బుకింగ్స్ ప్రారంభించారు. కానీ, కిరణ్ అబ్బవరం సినీ కెరీర్‌లో ట్రెండ్ సెట్ చేసిన క మూవీ తర్వాత ఆ రేంజ్‌లో జోరు లేదు. క, వినరో భాగ్యము విష్ణు కథ, ఎస్ఆర్ కల్యాణ మండపం వంటి సినిమాలతో పోలిస్తే దిల్‌రూబా కలెక్షన్స్ ఘోరంగానే ఉన్నాయని టాక్.

కోటి షేర్ వచ్చే అవకాశం

ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో దిల్‌రూబా ఓపెనింగ్స్ రూ. 70 నుంచి 80 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈవెనింగ్, నైట్ షోలను కలిపి మొత్తంగా తొలి రోజున దిల్‌రూబాకు తెలుగులో రూ. 90 లక్షల నుంచి 1 కోటి రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలు వేస్తున్నారు.

రెండు సినిమాల ఎఫెక్ట్

అయితే, కిరణ్ అబ్బవరం దిల్‌రూబా ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గడానికి కారణం నాని, ప్రియదర్శిల కోర్ట్ మంచి బజ్ క్రియేట్ చేయడం అని తెలుస్తోంది. తనకు పోటీగా వచ్చిన కోర్ట్ మూవీకి కలెక్షన్స్ బాగుంటున్నాయి. అలాగే, మరోవైపు రష్మిక మందన్నా ఛావా కూడా తెలుగులో ఆడటంతో కొంతమంది ఆడియెన్స్ అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో దిల్‌రూబా డే 1 కలెక్షన్స్ దారుణంగా ఉన్నట్లు సమాచారం.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం