Dil Raju on IT Raids: ఐటీ సోదాల గురించి స్పందించిన దిల్‍రాజు.. ఆశ్చర్యపోయారట-dil raju reacted on income tax it officials raids ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju On It Raids: ఐటీ సోదాల గురించి స్పందించిన దిల్‍రాజు.. ఆశ్చర్యపోయారట

Dil Raju on IT Raids: ఐటీ సోదాల గురించి స్పందించిన దిల్‍రాజు.. ఆశ్చర్యపోయారట

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2025 02:53 PM IST

Dil Raju on IT Raids: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు ఇళ్లు, ఆఫీస్‍ల్లో సుదీర్ఘంగా ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. దీనిపై చాలా రూమర్లు వచ్చాయి. ఈ తరుణంలో దిల్‍రాజు మీడియా సమావేశంలో ఈ విషయాలపై నేడు మాట్లాడారు.

Dil Raju on IT Raid: ఐటీ  సోదాల గురించి స్పందించిన దిల్‍రాజు.. ఆశ్చర్యపోయారట
Dil Raju on IT Raid: ఐటీ సోదాల గురించి స్పందించిన దిల్‍రాజు.. ఆశ్చర్యపోయారట

తెలుగు ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలతో పాటు ప్రముఖుల ఇళ్లలో ఇన్‍కమ్ ట్యాక్స్ (ఐటీ) ఐటీ సోదాలు హాట్‍టాపిక్‍గా మారాయి. ప్రముఖ నిర్మాత దిల్‍రాజు ఇల్లు, ఆఫీస్‍తో పాటు ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సుమారు మూడు రోజుల పాటు సుదీర్ఘంగా తనిఖీలు జరిగాయి. ఈ విషయంపై చాలా రూమర్లు బయటికి వచ్చాయి. దీంతో నేడు (జనవరి 25) మీడియా సమావేశంలో దిల్‍రాజు స్పందించారు. ఐటీ సోదాల అంశంపై మాట్లాడారు.

అవాస్తవాలు ప్రచారం చేయొద్దు

ఐటీ అధికారులు తమ ఇళ్లలో సోదాలు చేయడం గురించి సోషల్ మీడియాలో, మీడియాలో చాలా ఊహాగానాలు వచ్చాయని దిల్‍రాజు అన్నారు. తమ వద్ద డబ్బు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని పుకార్లు వచ్చాని, అవన్నీ నిజం కాదని అన్నారు. ఐటీ అధికారులు ఏమీ స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. తమ అందరి వద్దా కేవలం రూ.20లక్షల నగదు మాత్రమే గుర్తించారని, అన్ని లెక్కలు సరిగానే ఉన్నాయని తెలిపారు.

ఆశ్చర్యపోయారు

తమ పారదర్శకతను చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారని దిల్‍రాజు చెప్పారు. వాళ్లు కూడా ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. “సోదాలు జరిగేటప్పుడు అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని ఐటీ అధికారులు అనుకున్నారట. కానీ డిపార్ట్‌మెంటే ఆశ్చర్యపోయింది. వాళ్లకు మాకు జరిగిన కోఆపరేషన్‍లో వాళ్లు చాలా హ్యాపీ. ఉన్న దానిపై ఆడిటర్లు, ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్లు క్లారిటీ చేసుకుంటారు” అని దిల్‍రాజు చెప్పారు.

ఎవరూ టార్గెట్ చేయలేదు

టాలీవుడ్‍లో ఐటీ సోదాలు తనపై మాత్రమే జరగలేదని దిల్‍రాజు అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, అభిషేక్ అగర్వాల్ అఫీస్‍లపై కూడా జరిగాయి కదా అని దిల్‍రాజు చెప్పారు. ఐటీ సోదాలు అనేవి ఓ ప్రక్రియ అని చెప్పారు. తనను ఎవరూ టార్గెట్ చేయలేదని అన్నారు.

తల్లి ఆరోగ్యంపై..

దగ్గు ఎక్కువైన కారణంగానే తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించామని దిల్‍రాజు స్పష్టం చేశారు. ఐటీ సోదాల వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందంటూ కొందరు అసత్య ప్రచారం చేశారని, అది అవాస్తవం అని చెప్పారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగుందని, రెండో రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయి వస్తున్నారని తెలిపారు. ఏ విషయాల్లోనూ అవాస్తవాలను ప్రచారం చేయవద్దని దిల్‍రాజు కోరారు.

పోస్టర్ల లెక్కపై..

పోస్టర్లపై ఎక్కువ కలెక్షన్లు వేస్తున్నందునే ఐటీ తనిఖీలు జరిగాయనే వాదన వస్తోందనే వాదనకు దిల్‍రాజు స్పందించారు. ఇది ఇండస్ట్రీ అంతా కలిసి చర్చించుకోవాల్సిన అంశం అని అన్నారు. అంతా కలిసే మాట్లాడతామని తెలిపారు.

బ్లాక్‍మనీ ఎక్కడుంది?

సినీ ఇండస్ట్రీలో బ్లాక్‍మనీ ఉందా అనే ప్రశ్నకు కూడా దిల్‍రాజు స్పందించారు. ఇండస్ట్రీలో బ్లాక్‍మనీ ఎక్కడుందని, టికెట్లు 90 శాతం ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్‍ల్లోనే బుక్ అవుతున్నాయి కదా అని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే కలెక్షన్ల నుంచి బ్లాక్‍మనీ వస్తోందనేది కూడా ఊహనే అని చెప్పేశారు. తనపై 2008 తర్వాత మళ్లీ ఇప్పుడు ఐటీ సోదాలు జరిగాయని చెప్పారు. ఇండస్ట్రీలోని చాలా మందిపై ఇప్పుడు తనిఖీలు జరిగాయని అన్నారు. సోదాల తర్వాత లెక్కలతో ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా పత్రాలను దిల్‍రాజు చూపించారు. పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు.

దిల్‍రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి సందర్భంగా ఈ నెలలో విడుదలయ్యాయి. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. గేమ్ ఛేంజర్ మూవీని దిల్‍రాజు సుమారు రూ.350కోట్ల బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేశారని అంచనా.

Whats_app_banner

సంబంధిత కథనం