Hero Ashish: దెయ్యంతో రొమాన్స్ చేయడం డిఫరెంట్.. దిల్ రాజు వారసుడు, హీరో ఆశిష్-dil raju nephew ashish comments on love me if you dare movie vaishnavi chaitanya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero Ashish: దెయ్యంతో రొమాన్స్ చేయడం డిఫరెంట్.. దిల్ రాజు వారసుడు, హీరో ఆశిష్

Hero Ashish: దెయ్యంతో రొమాన్స్ చేయడం డిఫరెంట్.. దిల్ రాజు వారసుడు, హీరో ఆశిష్

Sanjiv Kumar HT Telugu
May 23, 2024 06:22 AM IST

Hero Ashish About Love Me Movie: దెయ్యంతో రొమాన్స్ చేయడం అనే విషయం డిఫరెంట్‌గా అనిపించిందని హీరో ఆశిష్ తెలిపాడు. మే 25న థియేటర్లలో విడుదల కానున్న లవ్ మీ సినిమా విశేషాలను హీరో ఆశిష్ పంచుకున్నాడు.

దెయ్యంతో రొమాన్స్ చేయడం డిఫరెంట్.. దిల్ రాజు వారసుడు, హీరో ఆశిష్
దెయ్యంతో రొమాన్స్ చేయడం డిఫరెంట్.. దిల్ రాజు వారసుడు, హీరో ఆశిష్

Dil Raju Hero Ashish Love Me Movie: ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ తనదైన స్టైల్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ హారర్ మూవీ లవ్ మీ (Love Me Movie Telugu). ఇఫ్ యు డేర్ అనేది సినిమాకు క్యాప్షన్. ఇందులో ఆశిష్‌కు జోడీగా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తోంది.

శిరీష్ సమర్పణలో దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ లవ్ మీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో ఆశిష్‌ సినిమాకు సంబంధించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ల‌వ్ మీ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఇది వ‌ర‌కు చేసిన సినిమాలా కాకుండా ల‌వ్ మీ చిత్రంలో డార్క్ త‌ర‌హాలో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. యూనిక్ క్యారెక్ట‌ర్‌. ఎవ‌రైనా ఓ ప‌ని చేయొద్దని అంటే అదే ప‌ని చేసే పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇందులో యూ ట్యూబ‌ర్‌గా క‌నిపిస్తాను. యూ ట్యూబ్‌లో స్టోరీస్ అప్‌లోడ్ చేసే హీరో ద‌గ్గ‌రికీ ఓ దెయ్యానికి సంబంధించిన స్టోరీ వ‌స్తుంది. అప్పుడు అత‌ని జీవితంలో ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌.

ఈ సినిమా కోసం డైరెక్ట‌ర్ అరుణ్‌తో ఎక్కువ‌గా మాట్లాడాను. ఆయ‌న హీరో పాత్ర ఎలా క‌నిపించాల‌నుకుంటున్నార‌నే విష‌యాల‌ను తెలుసుకున్నాను. అస‌లు హీరో ఏం ఆలోచిస్తున్నాడు.. ఏం చేస్తాడ‌నేది అత‌ని ప‌క్క‌నున్న వాళ్లే ఊహించ‌లేరు... నువ్వు నీలా ఉండు అని చెప్పే క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను.

డైరెక్ట‌ర్ అరుణ్ భీమ‌వ‌రుపు గురించి..?

డైరెక్ట‌ర్ అరుణ్ ఓ న‌వ‌లా ర‌చ‌యిత‌. చాలా నెమ్మ‌ద‌స్తుడు. త‌ను స్టోరీని చ‌క్క‌గా నెరేట్ చేస్తాడు. ల‌వ్ మీ స్టోరీని ఆయ‌న నాకు చెప్పిన‌ప్పుడు నా క్యారెక్ట‌ర్‌ను వివ‌రించిన తీరు నాకు బాగా న‌చ్చింది. ప్ర‌తీ విష‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోలా చూస్తార‌నే కాన్సెప్ట్ నచ్చింది. అలాగే దెయ్యంతో మాట్లాడ‌టం, రొమాన్స్ చేయ‌టం వంటి ఎలిమెంట్స్ డిఫ‌రెంట్‌గా అనిపించాయి.

రాజు గారి రెఫ‌రెన్స్ లేకుండానే డైరెక్ట‌ర్‌ గారు, మా ప్రొడ్యూస‌ర్ నాగ‌ గారు వెళ్లి పి.సి. శ్రీరామ్‌ గారిని క‌లిసి క‌థ చెప్పిన‌ప్పుడు ఆయ‌న వెంట‌నే సినిమా చేయ‌టానికి ఓకే చెప్పారు. అలాగే కీర‌వాణిగారు కూడా సినిమా చేయ‌టానికి ఒప్పుకున్నారు. అలా ఇద్ద‌రు లెజెండ్స్ మా సినిమా చేయ‌టానికి ఒప్పుకోవటంతో క‌థ కొత్త‌గా ఉంద‌నిపించింది.

ముందు డైరెక్ట‌ర్ రాసుకున్న క‌థ‌ను చెప్పింది చెప్పిన‌ట్లు తీస్తాడా? అని కూడా ఆలోచించాం. అందుక‌ని ముందు 15 రోజులు షూటింగ్ చేస్తాం, బాగా వ‌చ్చిందంటే ముందుకెళ‌దాం.. లేక‌పోతే ఇంకా బెట‌ర్‌మెంట్ చేసుకుని వెళ‌దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. 15 రోజుల త‌ర్వాత ఔట్‌పుట్ చూస్తే కొన్ని సీన్స్‌లో అయితే గూజ్ బ‌మ్స్ వ‌చ్చాయి.. నేచుర‌ల్‌గా కొన్ని సీన్స్ వ‌చ్చాయనిపించింది. దీంతో సినిమాను కంటిన్యూ చేశాం.

టీ20 వరల్డ్ కప్ 2024