Game Changer leaked song: కేసు వేసిన దిల్‍ రాజు.. సాంగ్ లీక్ చేసిన వారితో పాటు షేర్ చేసే వారిపై కూడా..-dil raju filed a case against game changer song leakage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Leaked Song: కేసు వేసిన దిల్‍ రాజు.. సాంగ్ లీక్ చేసిన వారితో పాటు షేర్ చేసే వారిపై కూడా..

Game Changer leaked song: కేసు వేసిన దిల్‍ రాజు.. సాంగ్ లీక్ చేసిన వారితో పాటు షేర్ చేసే వారిపై కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2023 05:56 PM IST

Game Changer leaked song: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఓ పాట లీకైంది. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తరుణంలో ఆ చిత్ర నిర్మాత దిల్‍ రాజు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిల్ రాజు, గేమ్ ఛేంజర్ పోస్టర్
దిల్ రాజు, గేమ్ ఛేంజర్ పోస్టర్

Game Changer leak song: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ హిట్ అయిన తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ ఇదే. ఈ సినిమా అప్‍డేట్ల కోసం ఆయన అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్స్ చేస్తున్నారు. అప్‍డేట్లు ఇవ్వాలని మేకర్లను అడుగుతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. కాసేపటికే ఇది వైరల్‍గా మారింది. దీనిపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‍ రాజు సీరియస్‍గా ఉన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం నుంచి “జరగండి..జరగండి” అనే ఆడియో సాంగ్ ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయింది. చాలా మంది ఈ పాటను వినేశారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఫైనల్ వెర్షన్ కాదని, బేసిక్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే, ఈ పాట లీకేజ్ గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్‍ పోలీస్ స్టేషన్‍లో కేసు వేశారు ఈ చిత్ర నిర్మాత దిల్‍రాజ్. సాంగ్ లీకేజీకి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సోషల్ మీడియాలో పాటను ఎవరు లీక్ చేశారో సోర్స్‌ను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దిల్‍రాజ్. అలాగే, వాట్సాప్ సహా సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ పాటను షేర్ చేసే ఎవరిపై అయినా యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కంప్లైట్ చేసిన పేపర్లను దిల్‍రాజుకు చెందిన సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. “మా సినిమా గేమ్ ఛేంజర్ కంటెంట్‍ను లీక్ చేసిన వారిపై ఐపీసీ 66(సీ) కింద క్రిమినల్ కేసు నమోదు చేశాం. అక్రమంగా లీక్ అయిన సరైన క్వాలిటీ లేని కంటెంట్‍ను వ్యాప్తి చేయద్దని మేం కోరుతున్నాం” అని పోస్ట్ చేసింది.

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్‍చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తోంది. జయరామ్, నాజర్, అంజలి, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. వచ్చే ఏడాది గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Whats_app_banner