Dil Raju: చిరంజీవి గేమ్ చేంజర్ చూశారు.. రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే?: దిల్ రాజు కామెంట్స్-dil raju comments on game changer trailer and chiranjeevi reaction after watching ram charan kiara advani shankar movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju: చిరంజీవి గేమ్ చేంజర్ చూశారు.. రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే?: దిల్ రాజు కామెంట్స్

Dil Raju: చిరంజీవి గేమ్ చేంజర్ చూశారు.. రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే?: దిల్ రాజు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Dil Raju About Game Changer And Chiranjeevi Reaction: రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్‌ తన ఫోన్‌లో ఉందని నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, చిరంజీవి వాళ్లు సినిమా చూశారని, దానిపై మెగాస్టార్ ఇచ్చిన రియాక్షన్‌ను దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.

చిరంజీవి గేమ్ చేంజర్ చూశారు.. రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే?: దిల్ రాజు కామెంట్స్

Dil Raju About Game Changer And Chiranjeevi Reaction: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’.

ఆదివారం (డిసెంబర్ 29) ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆరోజే గేమ్ చేంజర్ ట్రైలర్

అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. "గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ, అది మీ (ఆడియెన్స్) వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకు వస్తున్నాం" అని అన్నారు.

"సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి మీద 40, 50 ఏళ్ల నుంచి మీ అభిమానం అలానే ఉంటోంది. చిరంజీవి నుంచి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మందిని అందించారు. ఇలా అందరికీ మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంటూనే వస్తోంది" అని దిల్ రాజు చెప్పారు.

చరిత్ర క్రియేట్ చేసేలా

"అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం (పవన్ కల్యాణ్) గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఫిక్స్ అవుతాం. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి" అని దిల్ రాజు తెలిపారు.

"ఇటు వచ్చే ముందే చిరంజీవి గారికి ఫోన్ చేశాను. అప్పుడు సినిమా చూశారు కదా.. ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది. మరోసారి సినిమా చూడండి అని అడిగాను. వాళ్లు అక్కడ సినిమా చూడటం స్టార్ట్ చేశారు. నేను ఇక్కడకు బయల్దేరాను. ఇక్కడకు వచ్చిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు అని ఫ్యాన్స్‌కు చెప్పండి అని చిరంజీవి గారు అన్నారు" అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ నట విశ్వరూపం

"మెగా పవర్ స్టార్‌లో మెగాని, పవర్‌ని చూస్తారు. నాలుగేళ్ల క్రితం శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఏం ఫీల్ అయ్యానో.. చిరంజీవి గారు ఒక్కో సీన్ గురించి చెబుతూ ఉంటే అదే ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది. జనవరి 10న మీరు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతోన్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, కొద్ది సేపు పోలీస్ ఆఫీసర్‌గా, ఇంకొద్ది సేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు" అని దిల్ రాజు వెల్లడించారు.

"శంకర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటుంది. 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిడివి విషయంలోనూ శంకర్ గారితో మాట్లాడాను. అంతే నిడివిలో శంకర్ గారు అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు. సినిమా పరిగెడుతూనే ఉంటుంది. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది" అని దిల్ రాజు పేర్కొన్నారు.

గట్టిగా సెలబ్రేట్ చేసుకునేందుకు

"ఎస్‌జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కల్యాణ్ గారు ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5న ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ తర్వాత జనవరి 10న సినిమా రానుంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి" అని దిల్ రాజు కామెంట్స్ చేశారు.