Dil Raju Apology: క్షమాపణలు చెప్పిన నిర్మాత దిల్‍రాజు.. అర్థం చేసుకోకుండా రాద్దాంతం చేస్తున్నారని కామెంట్స్-dil raju apologized his comments regarding his comments in sankranthiki vasthunnam event at nizamabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju Apology: క్షమాపణలు చెప్పిన నిర్మాత దిల్‍రాజు.. అర్థం చేసుకోకుండా రాద్దాంతం చేస్తున్నారని కామెంట్స్

Dil Raju Apology: క్షమాపణలు చెప్పిన నిర్మాత దిల్‍రాజు.. అర్థం చేసుకోకుండా రాద్దాంతం చేస్తున్నారని కామెంట్స్

Dil Raju Apology: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‍లో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఎవరైనా నొచ్చుకొని ఉంటే సారీ అంటూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు.

Dil Raju Apology: క్షమాపణలు చెప్పిన నిర్మాత దిల్‍రాజు.. అర్థం చేసుకోకుండా రాద్దాంతం చేస్తున్నారని కామెంట్స్

ప్రముఖ నిర్మాత దిల్‍రాజు ప్రొడ్యూజ్ చేసిన రెండు చిత్రాలు ఈసారి సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బరిలో ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఇప్పటికే జనవరి 10న రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా దిల్‍రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల దిల్‍రాజు సొంతఊరు నిజామాబాద్‍లో ఈవెంట్ జరిగింది. అయితే, ఆ ఈవెంట్లో తాను చేసిన ఓ కామెంట్ పట్ల కొందరి నుంచి విమర్శలు రావడంతో నేడు (జనవరి 11) క్షమాపణలు చెప్పారు దిల్‍రాజు. ఏం జరిగిందంటే..

తెల్లకల్లు, మటన్ కామెంట్లపై..

ఆంధ్రాలో జనాలు సినిమాలకు వైబ్ అవుతారని, నిజామాబాద్‍లో తెల్లకల్లు, మటన్‍కు వైబ్ అవుతారంటూ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈవెంట్‍లో దిల్‍రాజు చెప్పారు. హీరో వెంకటేశ్‍కు చెబుతున్నట్టుగా ఈ కామెంట్లు చేశారు. దీంతో దిల్‍రాజుపై విమర్శలు వచ్చాయి. తెలంగాణను కించపరిచేలా ఆయన మాట్లాడారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అంటే కల్లు, మటన్ మాత్రమే అనేలా మాట్లాడారంటూ గుస్సా అయ్యారు. దీంతో ఈ విషయంపై దిల్‍రాజు స్పందించారు.

అర్థం చేసుకోకుండా రాద్దాంతం

తన సొంత ఊరురైన నిజామాబాద్‍లో ఎక్కువగా సినీ ఈవెంట్ జరగవని దిల్‍రాజు అన్నారు. అందుకే అక్కడ సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ నిర్వహించాం అని చెప్పారు. “మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెలగల గురించి ఈవెంట్‍లో సంబోధించాను. నేను ఆ ఈవెంట్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, హేళన చేశానని కొందరు మిత్రులు కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ మిస్ అవుతున్నానని నేను ఈవెంట్ చివర్లో చెప్పా. దావత్ చేసుకోవాలని ఉందని చెప్పా. నేను మన కల్చర్‌ను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా కొందరు రాద్దాంతం చేస్తున్నారు” అని దిల్‍రాజు చెప్పారు.

బాధపడి ఉంటే క్షమించాలంటూ..

ఒకవేళ తాను చేసిన కామెంట్ల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని దిల్‍రాజు కోరారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో తాను తీసిన ఫిదా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని తెలిపారు. ఫ్యామిలీ ఎమోషన్లకు తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఆ సినిమా ద్వారా చెప్పామని వివరించారు.

బలగం చిత్రం తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం తమను అభినందించిందని దిల్‍రాజు గుర్తు చేశారు. ఇది మా చిత్రం అంటూ గుండెలకు హత్తుకున్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల వారు ఆ చిత్రాన్ని మెచ్చుకున్నారని అన్నారు. “తెలంగాణ వాసిగా.. తెలంగాణను అభిమానించే నేను.. ఎలా హేళన చేస్తానని అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరికైనా తప్పుగా అర్థమై ఉంటే నన్ను క్షమించండి. మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో ఆ కొందరికి క్షమాపణలు” అని దిల్‍రాజు చెప్పారు.

రాజకీయాల్లోకి లాగొద్దు

తనను రాజకీయాల్లోకి లాగొద్దని దిల్‍రాజు స్పష్టంగా చెప్పేశారు. సినిమా రంగం నుంచి ఎఫ్‍డీసీ చైర్మన్‍గా ఎంపికయ్యానని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో ఉంటానని అన్నారు. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలని తాను ఎప్పుడూ అనుకుంటానని చెప్పారు. ఏపీలోని సినీ ఇండస్ట్రీలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్‍కు మేలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. తనను ఇలాంటి అవసరం లేని వాటిలో లాగొద్దని రాజకీయ పార్టీలను దిల్‍రాజు కోరారు.

సంబంధిత కథనం