టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమా జులై 4న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే తమ్ముడు సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, తమ్ముడు రిలీజ్‌కు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
హీరో నితిన్‌ను అల్లు అర్జున్ రేంజ్‌కు వెళ్లలేకపోయావని తాను చెప్పినట్లుగా ఆ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ కామెంట్స్ తమ్ముడు రిలీజ్ సమయంలో వైరల్ అయ్యాయి.
"నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్, బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే.. నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్‌గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్‌తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్‌గా చూడొద్దు" అని యాంకర్‌కు చెప్పారు దిల్ రాజు.
"ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే దిల్ రాజు డ్రీమ్స్ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్‌గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటీ అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం" అని దిల్ రాజు తెలిపారు.
"ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్‌లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం" అని తమ వెబ్‌సైట్ ప్లానింగ్ గురించి దిల్ రాజు పేర్కొన్నారు.
ఇకపోతే నితిన్ తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ, కన్నడ బ్యూటి సప్తమి గౌడ హీరోయిన్స్‌గా నటించారు. తెలుగు సీనియర్ హీరోయిన్ లయ తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక మలయాళ ముద్దుగుమ్మ స్వాసిక సైతం తమ్ముడు సినిమాలో కీలక పాత్ర పోషించారు.
సంబంధిత కథనం