Godfather vs Lucifer: గాడ్ ఫాద‌ర్ వ‌ర్సెస్ లూసిఫ‌ర్ - మ‌ల‌యాళంతో పోలిస్తే తెలుగులో ఏ మార్పులు చేశారంటే-differences between godfather and lucifer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Differences Between Godfather And Lucifer

Godfather vs Lucifer: గాడ్ ఫాద‌ర్ వ‌ర్సెస్ లూసిఫ‌ర్ - మ‌ల‌యాళంతో పోలిస్తే తెలుగులో ఏ మార్పులు చేశారంటే

Nelki Naresh Kumar HT Telugu
Sep 29, 2022 01:17 PM IST

Godfather vs Lucifer: చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ చిత్రం లూసిఫర్ ఆధారంగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంతో పోలిస్తే తెలుగులో ఏయే మార్పులు చేశారంటే

చిరంజీవి
చిరంజీవి (Twitter)

Godfather vs Lucifer: చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఆచార్య ప‌రాజ‌యం త‌ర్వాత చిరంజీవి న‌టించిన ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్‌ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స‌ల్మాన్ న‌టించిన తొలి తెలుగు సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ సినిమా లూసిఫ‌ర్ ఆధారంగా గాడ్‌ఫాద‌ర్ సినిమా తెర‌కెక్కించారు.మాతృక‌తో పోలిస్తే తెలుగులో ఎలాంటి మార్పులు చేశారు? ఎవ‌రెవ‌రు ఏ ఏ పాత్ర‌లు చేశారంటే

లూసిఫ‌ర్‌లో మోహ‌న్‌లాల్ చేసిన క్యారెక్ట‌ర్‌లో తెలుగులో చిరంజీవి క‌నిపించ‌నున్నారు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ క్యారెక్ట‌ర్ పేరు స్టీఫెన్ అని పెట్ట‌గా తెలుగులో గాడ్‌ఫాద‌ర్‌గా మార్చారు.

మోహ‌న్ లాల్ అసిస్టెంట్‌గా మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ చేసిన క్యారెక్ట‌ర్‌ను తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ (Salman khan) చేశాడు.

వివేక్ ఒబెరాయ్ క్యారెక్ట‌ర్‌లో స‌త్య‌దేవ్ న‌టించాడు.

మంజు వారియ‌ర్ పాత్ర‌ను న‌య‌న‌తార(Nayanthara) చేసింది.

యూట్యూబ‌ర్ గోవ‌ర్ద‌న్‌గా ఇంద్ర‌జిత్ సుకుమార‌న్ మ‌ల‌యాళంలో క‌నిపించ‌గా తెలుగులో ఈ క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ చేశాడు.

పోలీస్ ఆఫీస‌ర్ జాన్ విజ‌య్ పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని క‌నిపించ‌నున్నాడు.

మోహ‌న్ లాల్ అసిస్టెంట్ గా సాయికుమార్ చేసిన పాత్ర‌లో సునీల్ న‌టించాడు.

మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ క్యారెక్ట‌ర్ ఐదు నిమిషాల నిడివిలోపే ఉంటుంది. కానీ తెలుగులో స‌ల్మాన్‌ క్యారెక్ట‌ర్ లెంగ్త్ పెంచిన‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రిపై ప్ర‌త్యేకంగా థార్‌మార్ థ‌క్క‌ర్ మార్ పాట పెట్టారు. మ‌ల‌యాళంలో ఈ పాట క‌నిపించ‌దు. అలాగే గాడ్‌ఫాద‌ర్ ట్రైల‌ర్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 786లో క‌నిపించాడు. అత‌డిపై జైలులో ఓ ఫైట్ పెట్టారు. కానీ ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో ఆ ఫైట్ లేదు.

లూసిఫ‌ర్ రన్‌టైమ్ 2 గంట‌ల 54 నిమిషాలు ఉండ‌గా గాడ్‌ఫాద‌ర్ ర‌న్ టైమ్ మాత్రం 2 గంట‌ల 37 నిమిషాలు మాత్ర‌మే కావ‌డం గమనార్హం.

మలయాళ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా తెలుగు వెర్షన్ కు మోహన్ రాజా డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టాడు.

IPL_Entry_Point