మోస్ట్ వైలెన్స్ అవతారంలో, యాక్షన్ ప్యాక్డ్ రూపంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ అదిరిపోయాడు. తన కొత్త సినిమా ‘ధురంధర్’ కోసం అతను మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ మాస్, యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. ముఖంపై రక్తంతో కనిపించాడు. రణ్ వీర్ సింగ్ 40వ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రం ధురంధర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ధురంధర్ ఫస్ట్ లుక్ లో రణ్ వీర్ సింగ్ ఇంటెన్సివ్ గా కనిపించాడు. ధురంధర్ ఫస్ట్ లుక్ ను రణ్ వీర్ ఆదివారం (జూలై 6) మధ్యాహ్నం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. "ఒక ఇన్ఫెర్నో (ఫైర్ ఎమోజీ) ఉదయిస్తుంది. అజ్ఞాత పురుషుల నిజస్వరూపాన్ని వెలికి తీయండి' అని క్యాప్షన్ ఇచ్చాడు. రణవీర్ వాయిస్ ఓవర్ లో చీకటి, మసక వెలుతురులో అతను నడుచుకుంటూ వెళ్లడంతో వీడియో మొదలవుతుంది. క్లోజప్ షాట్ లో సిగరెట్ వెలిగిస్తున్నప్పుడు పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో రక్తసిక్తమైన ముఖం కనిపిస్తుంది.
ఈ వీడియోలో హెవీ యాక్షన్ మోడ్ లో రణ్ వీర్ కనిపించాడు. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లు కూడా యాక్షన్ ప్యాక్డ్ గెటప్ ల్లో ఉన్నారు. రణ్ వీర్ ఫస్ట్ లుక్ పై ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్ గా మారింది. ‘‘అబ్ హోగా రణ్ వీర్ సింగ్ కా కమ్ బ్యాక్ (ఇప్పుడు అతని పునరాగమనం)’’ అని ఒకరు యూట్యూబ్ లో రాశారు. మరొకరు 'ఇది అగ్ని' అని పేర్కొన్నారు. ఇంకా చాలా మంది అభిమానులు ఈ సినిమా టోన్ పై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
ధురంధర్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు ప్రభాస్ మూవీ రాజాసాబ్ కూడా రిలీజ్ కాబోతోంది. అంటే ఈ రెండు సినిమాలు థియేటర్లలో ఢీ కొట్టబోతున్నాయి.
ధురంధర్ ఫస్ట్ లుక్ విడుదలకు ఒక రోజు ముందు రణ్ వీర్ తన ఇన్ స్టాగ్రామ్ లో అన్ని పోస్టులను ఆర్కైవ్ చేసి, తన డిస్ ప్లే పిక్చర్ ను కూడా తొలగించాడు. 12:12 అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మధ్యాహ్నం 12:12 నిమిషాలకు ఫస్ట్ లుక్ వీడియోను షేర్ చేశారు. జియో స్టూడియోస్ సమర్పణలో, బి 62 స్టూడియోస్ నిర్మాణంలో ఈ మూవీ రాబోతుంది.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం ఆదిత్య ధార్. జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధార్ నిర్మించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తదితరులు నటించారు. భారత సూపర్ గూఢచారి, సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని ఫస్ట్ లుక్ వీడియో చూస్తే అర్థమవుతోంది.
సంబంధిత కథనం