OTT Romantic Comedy: ధనుష్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఈ వారమే ఓటీటీలోకి!
OTT Romantic Comedy: నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (నీక్) చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ వారమే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..
తమిళ స్టార్ ధనుష్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే దర్శకత్వంపై కూడా ఫోకస్ చేశారు. గతేడాది ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన రాయన్ మంచి హిట్ అయింది. తన మేనల్లుడు పవిశ్ నారాయణన్ హీరోగా ధనుష్ దర్శకత్వం వహించిన ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (NEEK)’ గత నెల ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఈ ‘నీక్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది.
ఈవారమే స్ట్రీమింగ్!
నీక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ వారంలోనే మార్చి 21వ తేదీన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుందని రూమర్లు బయటికి వచ్చాయి. ఈ విషయంపై ఆ ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అప్‍డేట్ వచ్చే అవకాశం ఉంది.
నీక్ సినిమాను థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా అమెజాన్ ప్రైమ్ వీడియో డీల్ చేసుకుందని తెలిసింది. అందుకే మార్చి 21వ తేదీకి స్ట్రీమింగ్‍ను షెడ్యూల్ చేసిందని టాక్. మరి ఆరోజునే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు వెర్షన్ జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా తమిళ వెర్షన్‍తోనే అడుగుపెట్టనుంది.
నీక్ మూవీలో పవిశ్ సరసన అనిఖ సురేంద్రన్ హీరోయిన్‍గా నటించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, శరత్ కుమార్, రాబియా ఖాతూన్, రమ్య రంగనాథన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని పక్కా రొమాంటిక్ కామెడీగా తెరెకక్కించారు ధనుష్. లవ్ బ్రేకప్ అవడం, మళ్లీ ప్రేమలో పడడం, మాజీ లవర్ మళ్లీ తన జీవితంలోకి రావడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.
నీక్ కలెక్షన్లు
నీక్ సినిమా సుమారు రూ.16కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో పాటు ఓపెనింగ్ కూడా బాగానే వచ్చింది. కానీ ఆ తర్వాత కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. డ్రాగన్ చిత్రం పోటీలో ఉండటం నీక్ మూవీపై ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది.
నీక్ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై ధనుష్, కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడాయ్ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలోనూ ధనుష్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో కింగ్, నాగార్జున, రష్మిక మందన్నా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‍లో తేరే ఇష్క్ మే మూవీ కూడా ధనుష్ లైనప్‍లో ఉంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బయోపిక్‍లోనూ నటించనున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు.
సంబంధిత కథనం