Action Thriller OTT: తెలుగులో మరో ఓటీటీలో రిలీజైన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ - కేజీఎఫ్‌తో పోటీ అనుకుంటే?
Action Thriller OTT: మార్టిన్ మూవీ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా తెలుగులో మరో ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. శుక్రవారం ఆహా ఓటీటీలో మార్టిన్ రిలీజైంది. ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది కన్నడంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
Action Thriller OTT: మార్టిన్ మూవీ తెలుగులో మరో ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ శుక్రవారం ఆహా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా...ఆహా ఓటీటీలో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
మార్టిన్ మూవీలో ధృవ్ సర్జా హీరోగా నటించాడు. ఈ మూవీకి సీనియర్ హీరో అర్జున్ కథను అందించాడు.
120 కోట్ల బడ్జెట్…
దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన మార్టిన్ మూవీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. యాక్షన్ అంశాలు బాగున్నా...కాన్సెప్ట్, ధృవ్ సర్జా యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్‌పై ట్రోల్స్ వచ్చాయి.
కన్నడంలో కేజీఎఫ్ సినిమా కలెక్షన్స్‌ను మార్టిన్ దాటుతుందంటూ ప్రచారం జరిగింది. కానీ కేజీఎఫ్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను కూడా అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది. మొత్తంగా థియేటర్లలో 25 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిన మార్టిన్ నిర్మాతలకు వంద కోట్ల మేర నష్టాలను తెచ్చిపెట్టింది.
వైభవి శాండిల్య, అన్వేషి జైన్…
మార్టిన్ మూవీలో ధృవ్ సర్జాకు జోడీగా వైభవి శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఏపీ అర్జున్ దర్శకత్వం వహించాడు. మార్టిన్ మూవీ షూటింగ్ దాదాపు 252 రోజులు జరిగింది. కన్నడంలో ఎక్కువ రోజులు షూటింగ్‌ను జరుపుకున్న సినిమాల్లో ఒకటిగా మార్టిన్ నిలిచింది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను దాదాపు 52 రోజుల పాటుమేకర్స్ షూట్ చేయడం గమనార్హం. ఈ సినిమాలో హీరో ధృవ్ సర్జా …మార్టిన్, అర్జున్ అనే రెండు క్యారెక్టర్స్‌లో కనిపించడం గమనార్హం.
మార్టిన్ కథ ఇదే...
అర్జున్ (ధృవ్ సర్జా) కస్టమ్స్ ఆఫీసర్.ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం పాకిస్థాన్ వెళతాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో అర్జున్ గతం మర్చిపోతాడు. తాను ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. తాను ఇండియా నుంచి వచ్చాననే నిజం బయటపడుతుంది.
తనను ప్రాణంగా ప్రేమించిన ప్రీతి (వైభవి శాండిల్య) ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండటంతో ఇండియాకు వస్తాడు అర్జున్. ప్రీతిని అర్జున్ ఎలా కాపాడుకున్నాడు? అర్జున్ ఐడెంటీటీతో మార్టిన్ ఇండియాకు ఎందుకు వస్తాడు? అర్జున్, మార్టిన్‌కు మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిని వరించింది అన్నదే మార్టిన్ మూవీ కథ.
అర్జున్ మేనల్లుడిగా...
సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ సర్జా. మార్టిన్ కంటే ముందు పొగరు, బహద్దూర్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ధృవ్ సర్జా అన్నయ్య చిరంజీవి సర్జా కూడా కన్నడంలో హీరోగా 30కిపైగా సినిమాలు చేశాడు. 39 ఏళ్ల వయసులో 2020లో హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశాడు