OTT Crime Thriller: శోభనం రాత్రే కాళరాత్రి అయితే.. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ చూశారా?
OTT Comedy Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఇప్పుడో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. యామీ గౌతమ్, ప్రతీక్ గాంధీ నటించిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం (జనవరి 27) రిలీజైంది. ఓ జంటకు శోభనం రాత్రే కాళరాత్రిగా మిగిలిపోతే ఎలా ఉంటుందో ఈ మూవీ చూడొచ్చు.
OTT Comedy Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ కు ఓటీటీ మంచి అడ్డా. అందులోనూ నెట్‌ఫ్లిక్స్ అంటే చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఓటీటీలోకి ఇప్పుడో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ కానుండగా.. సోమవారం (జనవరి 27) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ధూమ్ ధామ్ ఓటీటీ రిలీజ్ డేట్
నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా రాబోతున్న ఈ మూవీ పేరు ధూమ్ ధామ్ (Dhoom Dhaam). బాలీవుడ్ తోపాటు పలు టాలీవుడ్ సినిమాల్లో నటించిన యామీ గౌతమ్, స్కామ్ 1992 వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించిన ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. రిషబ్ సేఠ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు.
అప్పుడే పెళ్లి చేసుకొని శోభనం రాత్రి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఓ జంట కొందరు గ్యాంగ్‌స్టర్ల బారిన పడితే ఎలా ఉంటుందన్నది ఈ మూవీలో చూపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు కామెడీని జోడించి మూవీని తీసుకురాబోతున్నారు. ట్రైలరే చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాను వాలైంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ధూమ్ ధామ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
అప్పుడే ధూమ్ ధామ్ గా పెళ్లి చేసుకొని శోభనం రాత్రి కోసం సిద్ధమవుతారు కోయల్ (యామీ గౌతమ్), వీర్ (ప్రతీక్ గాంధీ) అనే భార్యభర్తలు. హనీమూన్ కోసం వెళ్లిన హోటల్లో ఆ ఇద్దరూ మాంచి మూడ్ లోకి వచ్చే సమయంలోనే వాళ్ల రూమ్ బెల్ మోగుతుంది.
వచ్చిన ఆ వ్యక్తి ఛార్లీ ఎక్కడ అని అడుగుతాడు? ఛార్లీ ఎవరు అంటూ ఆ అమాయకపు వీర్ ప్రశ్నిస్తాడు. అప్పటికీ అతని గురించి తెలిసిన కోయల్.. ఛార్లీ అనే పేరు విని షాక్ తింటుంది. ఇక ఆ తర్వాత ఆ జంట అసలు కష్టాలు మొదలవుతాయి. శోభనం రాత్రే కాళరాత్రి అవుతుంది. తర్వాత చేజింగ్ సీన్స్ తో ట్రైలర్ అంతా చాలా ఇంటెన్స్ గా సాగిపోతుంది.
తాను చేసుకున్న అమ్మాయిలోని మరో మాస్ యాంగిల్ కూడా చూసి షాక్ తింటాడు వీర్. ధూమ్ ధామ్ గా జరిగిన వీళ్ల పెళ్లి ఎక్కడి వరకూ వెళ్తుంది? అసలు ఈ జంటకు శోభనం జరుగుతుందా? ఆ ఛార్లీ ఎవరు? ఆ గ్యాంగ్ బారి నుంచి ఆ కొత్త జంట ఎలా తప్పించుకుంటుంది అన్నది చూడాలంటే ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ ధూమ్ ధామ్ మూవీ చూడాల్సిందే.
సంబంధిత కథనం