Dhee Promo: ప‌వ‌న్ పాట‌కు సీర‌త్ క‌పూర్‌తో జానీ మాస్ట‌ర్ స్టెప్పులు - ఢీ షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?-dhee dance show sri rama navami episode promo johnny master and seerat kapoor dance to pawan klyan tammudu movie song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhee Promo: ప‌వ‌న్ పాట‌కు సీర‌త్ క‌పూర్‌తో జానీ మాస్ట‌ర్ స్టెప్పులు - ఢీ షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

Dhee Promo: ప‌వ‌న్ పాట‌కు సీర‌త్ క‌పూర్‌తో జానీ మాస్ట‌ర్ స్టెప్పులు - ఢీ షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

Dhee Promo: ఢీ డ్యాన్స్ షో శ్రీరామ న‌వ‌మి స్పెష‌ల్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ్ముడు సినిమాలోని పాట‌కు హీరోయిన్ సీర‌త్ క‌పూర్‌, జానీ మాస్ట‌ర్ క‌లిసి స్టెప్పులు వేశారు.

ఢీ డ్యాన్స్ షో ప్రోమో

Dhee Promo: పండుగ వ‌చ్చిందంటే చాలు స్పెష‌ల్ ఈవెంట్స్‌, షోస్‌తో బుల్లితెర ఆడియెన్స్‌ను అల‌రించేందుకు టీవీ ఛానెల్లు రెడీ అవుతుంటాయి. పండుగ రోజు కొత్త ఈవెంట్స్‌ను ప్లాన్ చేసి ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఈ సారి శ్రీరామ న‌వ‌మికి ఈటీవీ కూడా అలాంటి స‌ర్‌ప్రైజ్‌లు బోలెడు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ వంటి షోల్లో పండుగలకు అనుగుణంగా స్పెషల్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. శ్రీరామనవమి రోజు ఢీ షోలో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఉండబోతోన్నాయి.మరీ ముఖ్యంగా సీతారాములు బుల్లితెరపై వచ్చారా? అన్నట్టుగా త‌మ పర్ఫామెన్స్ తో కంటెస్టెంట్స్ అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోన్నారు.

శ్రీరామ న‌వ‌మి ఎపిసోడ్‌...

శ్రీరామ న‌వ‌మి రోజు టెలికాస్ట్ కానున్న ఢీ షో లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో ఇటీవ‌ల రిలీజైంది. ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ మాత్రమే కాదు.. ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా అవ్వడంతో కంటెస్టెంట్లతో పాటు, ఆడియెన్స్‌‌లోనూ ఉత్కంఠ నెలకొంది. ఢీ షో లో నెక్స్ట్ రౌండ్‌లో ఎవ‌రూ అడుగుపెడ‌తారు? ఏ కంటెస్టెంట్ షో నుంచి ఎలిమినేట్ అవుతాడ‌న్న‌ది ప్రోమోలో స‌స్పెన్స్‌లో పెట్టారు?

ప్ర‌ణీత ఫిదా...

శ్రీరాముడి పాట‌లకు స్టెప్పులు వేసి జ‌డ్జెస్‌ను మెప్పించారు. కంటెస్టెంట్స్ డ్యాన్సులు చూసి గ‌ణేష్ మాస్ట‌ర్ కూడా జై శ్రీరామ్ అని నినాదించాడు. గ‌ణేష్ మాస్ట‌ర్‌తో పాటు ప్ర‌ణీత‌, జానీ మాస్ట‌ర్ కూడా కంటెస్టెంట్స్ స్టెప్పుల‌కు ఫిదా అయిపోయి నిల్చొని చ‌ప్ప‌ట్టు కొట్టారు.

జానీ, గ‌ణేష్ మాస్ట‌న్ క‌లిసి స్టెప్పులు...

ఈ ప్రోమోలో ఆదర్శ్ జగడం మూవీలోని వయలెన్స్ ఈజ్ ది ఫ్యాషన్ అనే సాంగ్‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేశాడు. ఆ సాంగ్‌కు గ‌ణేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు.ఈ పాట‌లో డ్యాన్సర్‌గా జానీ మాస్టర్ క‌నిపించాడు. గ‌ణేష్‌, జానీ ఇద్దరూ కలిసి జ‌గ‌డం పాట‌కు డ్యాన్స్ చేయ‌డం ఢీ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాట‌కు...

ఈ ప్రోమోలో హీరోయిన్ సీర‌త్ క‌పూర్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. రాఖీ పర్ఫామెన్స్‌లో సీరత్ కపూర్ మెరిసింది. జానీ మాస్టర్, సీరత్ కపూర్ ఇద్దరూ కలిసి స్టేజ్ మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తమ్ముడు మూవీ పాట‌కు స్టెప్పులు వేసి కంటెస్టెంట్స్‌తో పాటు జ‌డ్జెస్‌ను మెప్పించారు. శ్రీరామ‌న‌వ‌మి కానుక‌గా ఏప్రిల్ 17న బుధ‌వారం రాత్రి 9.30 గంట‌ల‌కు ఢీ స్పెష‌ల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈటీవీ విన్‌లోనూ ఈ ఎపిసోడ్‌ను చూడొచ్చు.

తెలుగులో టాప్‌...

ప్ర‌స్తుతం తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న డ్యాన్స్ రియాలిటీషోల‌లో ఢీ టాప్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంటోంది. ఢీ షో ద్వారా పాపుల‌ర్ అయిన ఎంతో మంది కంటెస్టెంట్స్ టాలీవుడ్‌లో కొరియోగ్రాఫ‌ర్స్‌గా రాణిస్తోన్నారు. ఢీ షోకు ప్ర‌స్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్లు గ‌ణేష్ మాస్ట‌ర్‌, జానీ మాస్ట‌ర్‌తో పాటు హీరోయిన్‌ ప్ర‌ణీత జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తొలుత జ‌డ్జ్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌ను తీసుకున్నాడు. అతడి స్థానంలో జానీ మాస్ట‌ర్ జ‌డ్జ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్‌గా రాఖీ, శ్వేత‌నాయుడు, శ్రీప్రియ‌తో మ‌రికొంద‌రు సినీ యాక్ట‌ర్స్ పాల్గొంటున్నారు. ఈ షోకు నందు, హైప‌ర్ ఆది యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.