Dhee Latest Promo: నేనేం వెర్రిపప్పనా...మైక్ విసిరేసి జానీ మాస్టర్ రచ్చ- ఢీ కొత్త ప్రోమో వైరల్
Dhee Latest Promo: ఏప్రిల్ 17న ప్రసారం కానున్న ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌పై జానీ మాస్టర్ ఫైర్ అయ్యాడు. మైక్ వేసిరేసి రచ్చచేశాడు. ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
Dhee Latest Promo: తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న డ్యాన్స్ రియాలిటీషోలో ఢీ స్థానం చాలా ప్రత్యేకం. చాలా ఏళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న షోకు ఇప్పటికీ అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్‌లో నిలుస్తూనే ఉంది. ఢీ కొరియోగ్రాఫర్స్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న ఎంతో మంది డ్యాన్సర్లు ఇప్పుడు టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్స్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
సెలబ్రిటీ స్పెషల్...
సెలబ్రిటీ స్పెషల్ పేరు ఢీ డ్యాన్స్ షో ప్రస్తుతం ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకు టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌తో పాటు హీరోయిన్ ప్రణీత జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్స్‌గా రాఖీ, శ్వేతనాయుడు, శ్రీప్రియతో మరికొందరు సినీ యాక్టర్స్ పాల్గొంటున్నారు. ఈ షోకు నందు, హైపర్ ఆది యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్నాఏప్రిల్ 17న టెలికాస్ట్ కానున్న ఢి సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్‌పై జానీ మాస్టర్ చాలా ఫైర్ అయ్యాడు.
ఓటింగ్ విషయంలో...
రాఖీ ఓటింగ్ విషయంలో జానీ మాస్టర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఒకరికి ఒక పవర్ ఇచ్చారు అంటే..ఆ పవర్ ఇంకొకరి మీద యూజ్ చేస్తున్నామంటే ప్రాపర్ రీజన్ ఉండాలి అని జానీ మాస్టర్ అనగానే....చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ...ఇన్‌డైరెక్ట్‌గా కళ్లతో అక్కకు ఓటేయ్యమని అన్న చెప్పాడు అంటూ సాత్విక్ మాస్టర్‌ను ఉద్దేశించి రాఖీ కామెంట్స్ చేశాడు.
అన్‌ఫెయిర్...
రాఖీ మాటలతో జానీ మాస్టర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇది అన్‌ఫెయిర్ కాకపోతే ఏంటి...నేనుందుకు కూర్చున్నాను ఇక్కడ. నేనేం వెర్రిపప్పనా అంటూ సీరియస్‌గా స్టేజ్ దిగి షో నుంచి బయటకు వెళ్లబోయాడు. కంటెస్టెంట్స్ బతిమాలినా జానీ మాస్టర్ వినలేదు. వారిపై కూడా అరిచాడు. సైగ చేశాడంటా..వీడు ఇచ్చాడంటా అంటూ అరిచాడు. చివరకు నందు సర్ధిచెప్పి జానీ మాస్టర్‌ను వెనక్కి తీసుకొచ్చాడు.
ఢీ అంటే ఆటలా...
స్టేజ్‌పైకి వచ్చిన జానీ మాస్టర్ రాఖీతో పాటు కంటెస్టెంట్స్‌పై కోపంతో చిందులో తొక్కాడు. . ఢీ అంటే ఆటలుగా అనిపిస్తుందా, ఢీ ఎలా కనబడుతుంది అంటూ రాఖీని నిలదీశాడు. అతడు సమాధానం చెప్పకపోవడంతో కోపంగా జానీ మాస్టర్ మైక్ విసిరేశాడు. మాట్లాడాలన్న లోపలనుంచి అంటూ అంటూ కోపంగా అరిచి స్టేజ్‌పై నుంచి దిగి షో నుంచి జానీ మాస్టర్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఈ ప్రోమోలో కనిపిస్తోంది.
జానీ మాస్టర్ రాక్...
ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ ఆన్ ఫైర్...జానీ మాస్టర్ రాక్..ఫ్యాన్స్ షాక్ అంటూ అభిమానులు ప్రోమోను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం షోపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చేసిన జిమ్మిక్ ఇదని, జబర్ధస్థ్‌కు మించి కామెడీ చేస్తున్నారని అంటున్నారు.ఏప్రిల్ 17న బుధవారం ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
హీరోగా ఎంట్రీ...
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా జానీ మాస్టర్ కొనసాగుతోన్నాడు. ఇటీవల విజయ్ బీస్ట్, వారిసుతో రజనీకాంత్ జైలర్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ సినిమాకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే జానీ మాస్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.