Dhee 17 Winner: ఢీ సీజన్ 17 విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్? - ట్రోఫీ అందించే గెస్ట్ ఎవరంటే?
Dhee 17 Winner: ఢీ సెలబ్రిట్రీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్‌గా వచ్చాడు. ఢీ సీజన్ 17 విన్నర్‌గా వర్షిణి నిలిచినట్లు సమాచారం శ్వేతానాయుడు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నట్లు చెబుతోన్నారు.
Dhee 17 Winner: ఢీ షో సీజన్ 17 ముగింపుకు చేరుకున్నది. మే 29న (బుధవారం ) గ్రాండ్ ఫినాలే జరుగనుంది. ఈ గ్రాండ్ ఫినాలే తాలూకు ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. గ్రాండ్ ఫినాలేకు వర్షిణి, శ్వేతానాయుడుతో పాటు ఆదర్శ్ చేరుకున్నారు. ఫైనల్‌లో ఈ ముగ్గురు తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టినట్లు ప్రోమో చూస్తుంటే కనిపిస్తోంది. ఈ ముగ్గురు రియల్ లైఫ్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు చేసినట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.
అనిల్ రావిపూడి గెస్ట్...
గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో అనిల్ రావిపూడి, హైపర్ ఆది ఒకరిపై మరొకరు వేసుకున్న పంచ్‌లు నవ్విస్తున్నాయి. రెండు సింహాలతో ఎంట్రీ ఇచ్చారు...ఆ సింహానికి తెలిస్తే ఏం అనరా అంటూ బాలకృష్ణ ఫోటోను చూపిస్తూ అనిల్ రావిపూడితో హైపర్ ఆది అన్నాడు. చెబుతావా ఏంటి? అని అనిల్ రావిపూడి అడగ్గా...చూడడా ఏంటి అని హైపర్ ఆది సమాధానం ఇవ్వడం నవ్వులను పూయిస్తోంది.
ఐపీఎల్ కామెంట్స్...
ఇటీవల ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్‌పై హైపర్ ఆది కౌంటర్ వేశాడు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోవూ అని హైపర్ ఆది అంటోండగా అతడి మాటలను అనిల్ రావిపూడి అడ్డుకున్నాడు. మిమ్మల్ని కవర్ చేద్దామని ఆ డైలాగ్ చెప్పా అని హైపర్ ఆది చెప్పాడు. ఆల్రెడీ నేను కవర్ చేసుకున్నా..బ్యాటింగ్ మామూలుగా లేదు. క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా...చాలా సెన్సిటివ్‌గా ఉన్నారని అనిల్ రావిపూడి అనగానే కంటెస్టెంట్స్‌తో షోలో ఉన్న అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
చిరంజీవి పాటకు
ఈ షోలో చిరంజీవి గుమ్ గుమాయించు మంచం అనే పాటకు అనిల్ రావిపూడి, శేఖర్ మాస్టర్ ఇద్దరు స్టెప్పులు వేసినట్టుగా ప్రోమోలో చూపించారు. ట్రోఫీని వీరిద్దరు కలిసే ఆవిష్కరించినట్లు తెలిసింది.
శేఖర్ మాస్టర్, అనిల్ రావిపూడి తొడగొట్టగానే ఢీ సీజన్ 17 టైటిల్‌ను చూపించినట్లు తెలిసింది.
శ్వేత డ్యాన్స్‌లకు...
శ్వేత డ్యాన్స్‌లకు అనిల్ రావిపూడి ఫిదా అయ్యాడు. ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పడం ప్రోమోలో కనిపిస్తోంది. ఆదర్శ్ పర్ఫార్మెన్స్‌ను శేఖర్ మాస్టర్ మెచ్చుకున్నాడు. వర్షిణి డ్యాన్స్‌ను ఔట్‌స్టాండింగ్ అంటూ అనిల్ రావిపూడి అన్నాడు.
వర్షిణి విన్నర్...
ఢీ సెలబ్రిటీ స్పెషల్ టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకుందామా అని హోస్ట్ నందు అనగానేఅనిల్ రావిపూడి విన్నర్‌ను అనౌన్స్‌చేసినట్లు తెలిసింది. ఢి సెలబ్రిటీ స్పెషల్ విన్నర్‌గా వర్షిణి నిలిచినట్లు వార్తలొస్తున్నాయి. శ్వేతానాయుడు రన్నరప్‌గా నిలిచినట్లు చెబుతోన్నారు.వర్షిణి, శ్వేతానాయడు మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఫైనల్ సాగినట్లు సమాచారం. ఫైనల్‌కు ముందుగానే ఆదర్శ్ ఎమిలినేట్ అయినట్లు చెబుతోన్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ ఫినాలే మే 29 బుధవారం రాత్రి 9.30 ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది.
టాపిక్