Dhanya Balakrishna Secret Marriage: కల్పిక చెప్పిందే నిజమైందా? ధన్య బాలకృష్ణ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?
Dhanya Balakrishna Secret Marriage: టాలీవుడ్ నటి ధన్యా బాలకృష్ణ రహస్యంగా ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుందని కల్పిక గణేశ్ వ్యాఖ్యలు నిజమైనట్లు తెలుస్తోంది. సదరు దర్శకుడు కల్పికపై పిటీషన్ వేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
Dhanya Balakrishna Secret Marriage: టాలీవుడ్ నటి కల్పిక గణేష్(Kalpika Ganesh).. ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఎక్కిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాల్లో పలు సహాయ పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొంతమంది నటీనటుల గురించి సంచలన విషయాలను బహిర్గతం చేసింది. అందులో ముఖ్యంగా ప్రముఖ నటి ధన్య బాలకృష్ణపై(Dhanya Balakrishna) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె రహస్యంగా ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుందని, అయినా ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదని స్పష్టం చేసింది. కల్పిక చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఇవి నిజమేనని అనిపిస్తుంది. ధన్యాను వివాహం చేసుకున్న దర్శకుడు బాలాజీ మోహన్ కోర్టులో వేసిన పిటీషన్‌తో నిజం తేటతెల్లమైంది.

మద్రాసు హైకోర్టులో ధన్య భర్త అని చెబుతున్న బాలాజీ మోహన్.. కల్పిక గణేష్‌పై కేసు వేశారు. కల్పిక తరచూ తమ వివాహం, వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగంగా మాట్లాడుతోందని పిటీషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ పెళ్లి ఏడాది క్రితం జరిగిందని కూడా అందులో ప్రస్తావించారు.
బాలాజీ మోహన్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అతడు ధన్యాను పెళ్లి చేసుకున్నట్లు ఈ పిటీషన్ ద్వారా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఎందుకు బయటపెట్టాలనుకోలేదో అనేదానిపై స్పష్టత లేదు.
ప్రముఖ నటి ధన్యా బాలకృష్ణపై కల్పిల సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్యాకు రహస్యంగా వివాహం జరిగిందని, అయితే బయటకు మమాత్రం కానట్లే ఉంటుందని ఆరోపణలు చేసింది. లవ్ ఫెయిల్యూర్ మూవీ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈమె సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసిన కల్పికా.. అందులో ఈ వ్యాఖ్యలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్