Dhanush: హీరో ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా.. 3 జంటల ప్రేమకథతో.. టైటిల్‌గా హిట్ సాంగ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?-dhanush third direction movie jabilamma neeku antha kopama tamil and telugu release date announced with first look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush: హీరో ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా.. 3 జంటల ప్రేమకథతో.. టైటిల్‌గా హిట్ సాంగ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

Dhanush: హీరో ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా.. 3 జంటల ప్రేమకథతో.. టైటిల్‌గా హిట్ సాంగ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 19, 2025 06:52 AM IST

Dhanush Jabilamma Neeku Antha Kopama Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముచ్చటగా మూడోసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాను మూడు జంటల ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సూపర్ హిట్ తెలుగు సాంగ్ జాబిలమ్మ నీకు అంత కోపమా టైటిల్ ఫిక్స్ చేశారు.

హీరో ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా.. 3 జంటల ప్రేమకథతో.. టైటిల్‌గా హిట్ సాంగ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
హీరో ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా.. 3 జంటల ప్రేమకథతో.. టైటిల్‌గా హిట్ సాంగ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

Hero Dhanush Third Direction Movie Telugu Release Date: తమిళ, తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా ధ‌నుష్‌కి ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.

yearly horoscope entry point

ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు

ధనుష్ మొదటి సారి దర్శకత్వం వహించిన సినిమా పా పాండి (2017). ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా చేశాడు. ఈ సినిమా అనంతరం గతేడాది రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాయన్ మూవీతో మరోసారి తన డైరెక్షన్‌తో అలరించాడు ధనుష్. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది.

మారి 2 తర్వాత నిర్మాణం

పా పాండి, రాయ‌న్ సినిమా త‌ర్వాత ధ‌నుష్ మరోసారి ముచ్చటగా మూడోసారి డైరెక్ష‌న్‌ చేస్తున్నాడు. ధనుష్ దర్శకత్వంలో మూడోసారి తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. ఆర్‌కే ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి ధ‌నుష్ సొంత నిర్మాణ సంస్థ వండ‌ర్‌బార్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2018లో విడుద‌లైన మారి 2 మూవీ త‌ర్వాత ధ‌నుష్ నిర్మిస్తోన్న సినిమా ఇది.

రొమాంటిక్ కామెడీ స్టోరీ

అయితే, రొమాంటిక్ కామెడీ క‌థ‌ను ధ‌నుష్ రాయ‌టం విశేషం. మూడు ప్రేమ జంటల ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అంతా ఓ చోట పడుకుని ఆకాశంలోకి చూస్తు ఉన్నారు. వారిలో రెండు జంటలు ఒకరిపై ఒకరు పడుకుని ఉంటే, మరో జంట పక్కపక్కనే పడుకుని ఉంది. అలాగే, ఒక సింగిల్ అమ్మాయి కూడా పక్కనే వాళ్లను చూస్తూ పడుకుంది.

బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్

ఇంట్రెస్టింగ్‌గా ఈ పోస్టర్ ఉంది. ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాను త‌మిళంతో పాటు తెలుగులో ఫిబ్ర‌వ‌రి 21న విడుదల కానుంది. కాగా 1997లో వడ్డే నవీన్, మహేశ్వరి హీరో హీరోయిన్స్‌గా నటించి పెళ్లి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో జాబిలమ్మా నీకు అంత కోపమా అనే పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ ఆ పాట ఎవర్ గ్రీన్ సాంగే.

ఇది వరకు ఇదే బ్యానర్

ధనుష్ మూడో సారి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు తెలుగు టైటిల్‌గా ఆ సాంగ్ పెట్టడం విశేషంగా మారింది. అయితే, ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి విడుద‌ల చేస్తోంది. ధ‌నుష్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాయ‌న్ సినిమాను కూడా ఇదే బ్యాన‌ర్ తెలుగులో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

హీరో హీరోయిన్స్

తాజాగా ఇప్పుడు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వీష్‌, అనిఖా సురేంద్ర‌న్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, మాథ్యూ థామ‌స్‌, వెంక‌టేష్ మీన‌న్‌, ర‌బియా ఖ‌తూన్‌, ర‌మ్యా రంగ‌నాథ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాకు సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందించగా లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫ‌ర్‌గా, జీకే ప్ర‌స‌న్న ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Whats_app_banner