Raayan: ధనుష్ స్వీయ దర్శకత్వంలో రాయన్.. సందీప్ కిషన్ లీడ్ రోల్.. తల వంచి ఎరగడే సాంగ్ రిలీజ్
Dhanush Raayan Song Release Sundeep Kishan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా రాయన్. ఇందులో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇటీవల రాయన్ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ తల వంచి ఎరగడే రిలీజ్ అయింది.
Dhanush Raayan Sundeep Kishan: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్‌గా తన 50వ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ 'రాయన్' (Raayan Movie). కాళిదాస్ జయరామ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
తల వంచి ఎరగడే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ (AR Rahman) మాస్ నంబర్‌ను కంపోజ్ చేశారు. పాటని గ్రాండ్‌గా చిత్రీకరించారు. ధనుష్ ఒక కార్నివాల్‌లో చాలా మంది గ్రామస్తులతో కలిసి మాస్ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు.
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose) లిరిక్స్‌తో హేమచంద్ర, శరత్ సంతోష్ పవర్ ఫుల్‌గా పాడిన ఈ పాటకు ప్రభుదేవా అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి మాస్‌కు బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో ధనుష్ హ్యాండిల్ బార్ మీసాలతో షార్ట్ హెయిర్‌తో కనిపిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి తల వంచి ఎరగడే పాట పర్ఫెక్ట్ అని మేకర్స్ చెబుతున్నారు.
ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య (SJ Surya), సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి (Aparna Balamurali), ధుషార విజయన్ ఇతర ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్‌గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా రాయన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ రాయన్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. కాగా ధనుష్ పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.
గతేడాది తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్ మూవీగా సార్/వాతి (Sir Movie) సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాయన్ మూవీ ద్వారా దర్శకుడిగా తన ప్రతిభ ఏంటో నిరూపించుకోనున్నాడు ధనుష్., రాయన్ సినిమానే కాకుండా కుబేర మూవీ కూడా చేస్తున్నాడు ధనుష్.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ధనుష్‌తోపాటు నాగార్జున (Nagarjuna), రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్నారు. ఇటీవలే కుబేర నుంచి ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.