Trp Rating: 150 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీకి వన్ టీఆర్‌పీ రేటింగ్- థియేటర్లలో హిట్ - టీవీలో డిజాస్టర్
Trp Rating: థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ధనుష్ రాయన్ మూవీ టీవీలో మాత్రం డిజాస్టర్ రిజల్ట్‌ను సొంతం చేసుకున్నది. రాయన్ ఫస్ట్ తెలుగు టీవీ ప్రీమియర్‌కు కేవలం 1.87 టీఆర్‌పీ మాత్రమే వచ్చింది. రాయన్ మూవీకి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించాడు.
Trp Rating: రాయన్ మూవీ ధనుష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించింది. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
వన్ టీఆర్‌పీ రేటింగ్...
రాయన్ మూవీ తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యింది. తెలుగు వెర్షన్ సైతం నిర్మాతలకు మంచి లాభాలనుతెచ్చిపెట్టింది. కాగా ఇటీవలే రాయన్ తెలుగు వెర్షన్ జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు కేవలం 1.87 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.
అర్బన్ ఏరియాలో మరింత తక్కువగా 1.75 టీఆర్‌పీతో సరిపెట్టుకున్నది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీని టీవీలో ఆడియెన్స్ ఎవరూ పట్టించుకోలేదు.
సందీప్ కిషన్...
రాయన్ మూవీలో ధనుష్‌తో పాటు సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించారు.ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ధనుష్ రాయన్ సినిమాను తెరకెక్కించాడు.
ధనుష్ యాక్టింగ్, డైరెక్షన్‌తో పాటు దుషారా విజయ్ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో సందీప్ కిషన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో కనిపించాడు. రాయన్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
రాయన్ కథ ఇదే...
రాయన్ (ధనుష్).... చెల్లెలు దుర్గ తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్‌కిషన్), మాణిక్యం (కాళిదాస్ జయరాం) ప్రపంచంగా బతుకుతుంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమవ్వడంతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతూ కష్టపడి తమ్ముళ్లు, చెల్లెలిని రాయన్ పెంచుతాడు. రాయన్ ఏరియాలో దురై, సేతురామన్ (ఎస్‌జే సూర్య) గ్యాంగ్స్ మధ్య ఆధిపోత్య పోరు జరుగుతుంటుంది.
దురై అడ్డు తొలగించుకొని ఆ ఏరియాను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని సేతురామన్ ప్రయత్నాలు చేస్తుంటాడు. దురై హత్యతో అనుకోకుండా ఈ గ్యాంగ్‌స్టర్ గొడవల్లోకి రాయన్ రావాల్సివస్తుంది. అలా ఎందుకు జరిగింది?
దురైని చంపింది ఎవరు? సొంత అన్నయ్యే ముత్తువేల్ ఎందుకు ఎదురుతిరిగాడు? తన తమ్ముడి ప్రాణాలను తన చేతులతోనే రాయన్ ఎందుకు తీయాల్సివచ్చింది? ఈ గొడవలకు సిటీ పోలీస్ కమీషనర్‌కు (ప్రకాష్ రాజ్) ఎలాంటి సంబంధం ఉంది అనే అంశాలతో రాయన్ మూవీని తెరకెక్కించాడు ధనుష్.
11 సినిమాలు…
ప్రస్తుతం హీరోగా ధనుష్ 11 సినిమాలు చేస్తోన్నాడు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మూవీలో నటిస్తోన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో నాగార్జున ఓ కీలక పాత్ర చేస్తోన్నాడు.