ఆదిపురుష్ డైరెక్టర్‌తో ధనుష్ పాన్ ఇండియా మూవీ.. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాపై సినిమా.. కేన్స్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్-dhanush as kalam adipurush director om raut to direct national award winner in missile man of india biopic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆదిపురుష్ డైరెక్టర్‌తో ధనుష్ పాన్ ఇండియా మూవీ.. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాపై సినిమా.. కేన్స్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్

ఆదిపురుష్ డైరెక్టర్‌తో ధనుష్ పాన్ ఇండియా మూవీ.. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాపై సినిమా.. కేన్స్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్

Hari Prasad S HT Telugu

ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ధనుష్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అబ్దుల్ కలాంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆదిపురుష్ డైరెక్టర్‌తో ధనుష్ పాన్ ఇండియా మూవీ.. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాపై సినిమా.. కేన్స్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్

ధనుష్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కుబేరలో నటిస్తున్న అతడు.. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి కలాం అనే మూవీ చేయబోతున్నాడు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ లాంటి వాళ్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంచ్ చేయడం విశేషం.

‘కలాం’గా ధనుష్

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మన దేశ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ నటిస్తున్నాడు. కలాం అనే టైటిల్ పెట్టారు. ఆయన బయోపిక్ ఇది. దీనికి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్‌లైన్ ఉంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగా ఉంది.

బ్యాక్‌గ్రౌండ్లో కలాం పాత్రలో ధనుష్ కనిపించగా.. మిస్సైల్ గాల్లోకి దూసుకెళ్లడం ముందు చూడొచ్చు. తన్హాజీ, ఆదిపురుష్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఓం రౌత్ ఈ ప్రతిష్టాత్మక సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియన్ సినిమాలో ప్రముఖ నిర్మాతలైన అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తుండటం విశేషం.

కలాం మూవీ గురించి..

అబ్దుల్ కలాం బయోపిక్‌గా ఈ కలాం మూవీ తెరకెక్కుతోంది. ఆ మిస్సైల్ మ్యాన్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఇందులో చూపించబోతున్నారు. ఆయన భారతదేశ అంతరిక్ష, రక్షణ రంగాలకు కలాం అందించిన సేవలు ఎనలేనివి. అలాంటి వ్యక్తి బయోపిక్ అంటే సహజంగానే ఆసక్తి రేపుతుంది. అందుకు తగినట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. దేశానికి మిస్సైల్ టెక్నాలజీని అందించడంలో కలాందే కీలకపాత్ర.

దీంతో ఆ అంశాన్నే హైలైట్ చేస్తూ ఈ పోస్టర్ రూపొందించారు. ఇండియన్ సినిమాలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ధనుష్.. కలాం పాత్ర పోషించనుండటం నిజంగానే ఎంతో ఆసక్తి రేపుతోంది. కలాం పాత్రలో అతని నటన ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం