OTT Adventure Comedy Movie: ఆరేళ్లుగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రాని ధనుష్ నటించిన అడ్వెంచర్ కామెడీ ఇంగ్లిష్ మూవీ.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కానుంది. 2019లో థియేటర్లలో రిలీజైనా.. ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడీ సినిమాను తెలుగులో ఆహా వీడియో ఓటీటీ తీసుకురానుంది. శుక్రవారం (మార్చి 21) దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.
ధనుష్ నటించి ఈ ఇంగ్లిష్ అడ్వెంచర్ కామెడీ మూవీ పేరు ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ఎ ఫకీర్. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఆహా వీడియో ఓటీటీలో మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (మార్చి 21) వెల్లడించింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు ఈ మూవీ 24 గంటలు ముందుగానే అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ఇది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన మూవీ ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ (The Extraordinary Journey Of the Fakir) జూన్ 21, 2019లో ఇండియాలో రిలీజైంది. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సుమారు ఆరేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా త్వరలోనే రానుందంటూ ఈ నెల మొదట్లోనే ఆహా వీడియో అనౌన్స్ చేయగా.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది.
ధనుష్ నటించిన మూవీ ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్. కెన్ స్కాట్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. 2 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర కేవలం 32 లక్షల డాలర్లే వసూలు చేసింది. ఇందులో అజాతశత్రు లవష్ పటేల్ అనే ఓ మెజీషియన్ పాత్రలో ధనుష్ కనిపించాడు. తనకు అతీత శక్తులు ఉన్నాయని జనాలను నమ్మించే వ్యక్తి అతడు. ముంబైలోని ఓ స్లమ్ లాంటి ఏరియాలో జీవిస్తుంటాడు.
పోలీసులకు చిక్కిన ముగ్గురు చిన్నారులకు అతడు తన కథను చెబుతాడు. తన తల్లి అకాల మరణం తర్వాత పారిస్ లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఐకియాలోని ఓ వార్డ్‌రోబ్ లో చిక్కుకొని ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్తాడు. ఆ తర్వాత అతని పరిస్థితి ఏమైంది? తన తండ్రిని చేరుకుంటాడా లేదా అన్నది మూవీలో చూడొచ్చు.
సంబంధిత కథనం