Raayan OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. డేట్ ఇదే!
Raayan OTT Release: రాయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. హీరోగా నటించిన ధనుష్ ఈ చిత్రానికి దర్శకత్వం కూడా చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.
తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమా భారీ హిట్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఆయనే దర్శకత్వం కూడా వహించారు. అందులోనూ హీరోగా ధనుష్‍కు 50వ సినిమా కావడంతో రాయన్‍పై మరింత ఆసక్తి నెలకొంది. అంచనాలను నిలుపుకుంటూ రాయన్ సినిమా భారీ హిట్ అయింది. జూలై 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ రాయన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఓటీటీ డేట్ ఇదే!
రాయన్ సినిమా ఆగస్టు 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా ఓటీటీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. అందుకే ఈనెలాఖరు ఆగస్టు 30వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ప్రైమ్ వీడియో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రాయన్ ఓటీటీ హక్కులను సన్‍నెక్స్ట్ ఓటీటీ కూడా దక్కించుకున్నట్టు మొదట్లో సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఈ చిత్రం ప్రైమ్ వీడియోతో పాటు సన్‍నెక్స్ట్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి.. రెండు ఓటీటీల్లో ఈ చిత్రం అడుగుపెడుతుందా అనేది చూడాలి.
రాయన్ సినిమాలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, సందీప్ కిషన్, కాళి దాసు జయరాం, దుషరా విజయన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‍జే సూర్య విలన్‍గా నటించారు. అపర్ణా బాలమురళి, శరవణన్, సెల్వ రాఘవన్, ప్రకాశ్ రాజ్, దిలీపన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని రస్టిక్ మాస్ యాక్షన్ చిత్రంగా ధనుష్ తెరకెక్కించారు. హీరోగా అద్భుత పర్ఫార్మెన్స్ చేసిన ఆయన డైరెక్టర్‌గానూ అదరగొట్టారు.
రూ.150కోట్లకు చేరువైన దాటిన రాయన్
రాయన్ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయింది. రెండు భాషల్లోనూ భారీ వసూళ్లను దక్కించుకుంటోంది. ఇంకా జోరు చూపిస్తోంది. రాయన్ చిత్రానికి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.145 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.150కోట్ల మార్కు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ధనుష్ కెరీర్లో బెగ్గెస్ట్ హిట్‍గా రాయన్ నిలుస్తోంది.
రాయన్ చిత్రాన్ని సన్‍పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ధనుష్ టేకింగ్, యాక్టర్ల పర్ఫార్మెన్స్, రహమాన్ మ్యూజిక్ ఇలా ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను ఈ మూవీ దక్కించుకుంటోంది.
కుబేరలో ధనుష్ బిజీ
ధనుష్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి. సోషల్ డ్రామాగా ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ మూవీలోనూ ధనుష్ నటిస్తున్నారు.