హెల్త్ కూడా లెక్కచేయకుండా కష్టపడ్డారు.. ఇది నాకు 52వ తమిళ్, రెండో తెలుగు సినిమా.. ఓం నమశ్శివాయ అంటూ హీరో ధనుష్ స్పీచ్-dhanush about sekhar kammula nagarjuna rashmika in kubera pre release event and speech start with om namah shivaya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హెల్త్ కూడా లెక్కచేయకుండా కష్టపడ్డారు.. ఇది నాకు 52వ తమిళ్, రెండో తెలుగు సినిమా.. ఓం నమశ్శివాయ అంటూ హీరో ధనుష్ స్పీచ్

హెల్త్ కూడా లెక్కచేయకుండా కష్టపడ్డారు.. ఇది నాకు 52వ తమిళ్, రెండో తెలుగు సినిమా.. ఓం నమశ్శివాయ అంటూ హీరో ధనుష్ స్పీచ్

Sanjiv Kumar HT Telugu

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేశారు. ఈ సందర్భంగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ కుబేర విశేషాలు చెప్పారు.

హెల్త్ కూడా లెక్కచేయకుండా కష్టపడ్డారు.. ఇది నాకు 52వ తమిళ్, రెండో తెలుగు సినిమా.. ఓం నమశ్శివాయ అంటూ హీరో ధనుష్ స్పీచ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన తెలుగు, తమిళ సినిమా కుబేర. తెలుగు పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఓం నమశ్శివాయ అంటూ

భారీ బడ్జెట్‌తో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కుబేర మూవీని నిర్మించారు. తాజాగా ఆదివారం (జూన్ 15) కుబేర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓం నమశ్శివాయ అంటూ ధనుష్ స్పీచ్ స్టార్ట్ చేశాడు.

నాన్నగారు గుర్తుకొచ్చారు

హీరో ధనుష్ మాట్లాడుతూ.. "ఓం నమశ్శివాయ. అందరికీ నమస్కారం. ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఈరోజు ఇక్కడ నేను ఉండటానికి కారణం ఆయన కష్టం. ఈ సందర్భంగా నాన్నకి కృతజ్ఞతలు" అని అన్నారు.

చాలా కంగారు పడ్డాను

"శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. హెల్త్‌ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు. ఆయన విషయంలో నేను చాలా కంగారు పడ్డాను. ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా. శేఖర్ గారు సార్ సినిమాకి ముందే ఈ కథ నాకు చెప్పారు. నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందం" అని ధనుష్ తెలిపాడు.

అద్భుతమైన క్యారెక్టర్

"కుబేరలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్ గారికి ధన్యవాదాలు. నాగార్జున గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్" అని ధనుష్ పేర్కొన్నాడు.

వారు లేకపోతే

"రష్మిక మందన్నా హార్డ్ వర్క్ చేసింది. తన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. సునీల్ గారికి రామ్మోహన్ గారికి థాంక్ యూ. వారు లేకపోతే ఈ సినిమా లేదు. నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. జూన్ 20న వస్తుంది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది" అని ధనుష్ స్పీచ్ ముగించాడు.

వండర్‌ఫుల్ టీంతో

ఇదే ఈవెంట్‌లో కుబేర ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా వండర్‌ఫుల్ టీంతో కలిసి చేసిన సినిమా ఇది. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం