టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంత పని చేశాడా? ఇండియన్ టీమ్ కు ఆడిన అతను తన మాజీ భార్యను మోసం చేశాడా? ఇప్పుడు అతని మాజీ వైఫ్ ధనశ్రీ వర్మ చేసిన సంచలన ఆరోపణలు ఇలాగే ఉన్నాయి మరి. పెళ్లయిన రెండో నెలకే చాహల్ చీటింగ్ చేస్తున్నాడని కనిపెట్టానని ఓ రియాలిటీ షోలో ధనశ్రీ చెప్పింది.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల అనంతరం కూడా హెడింగ్ లో నిలుస్తూనే ఉన్నారు. అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ రియాలిటీ షో ‘రైజ్ అండ్ ఫాల్’ లో పార్టిసిపేట్ చేస్తున్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ తాజాగా మాజీ భర్త చాహల్ పై సంచలన ఆరోపణలు చేసింది. వివాహం జరిగిన రెండు నెలల్లోనే అతను మోసం చేశాడని ఆరోపించింది.
షోలో ఒక ఎపిసోడ్ లో ధనశ్రీ నటి కుబ్రా సైట్ తో టిఫిన్ చేస్తూ మాట్లాడటం కనిపించింది. కుబ్రా ఆమెను.. "మీ రిలేషన్ షిప్ ముందుకు సాగదని, ఇది పొరపాటు అని మీకెప్పుడు అనిపించింది’’ అని ధనశ్రీని అడిగింది.
కుబ్రా సైట్ ప్రశ్నకు ధనశ్రీ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. "పెళ్లయిన మొదటి సంవత్సరం రెండవ నెలలో అతన్ని పట్టుకున్నా "అని ధనశ్రీ చెప్పడంతో కుబ్రా షాక్ కు గురైంది. ఈ ఆరోపణలు ఇప్పటికే చాలా చర్చనీయాంశమైన డివోర్స్ గురించి మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.
ధనశ్రీ సంచలన ఆరోపణలకు కొన్ని నెలల ముందు చాహల్ పోడ్ కాస్ట్ లో రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోసం ఆరోపణల గురించి మాట్లాడాడు. భారత స్పిన్నర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ "అతను తన జీవితంలో ఎప్పుడూ మోసం చేయలేదు" అని చెప్పాడు.
"నా విడాకులు జరిగినప్పుడు, నేను మోసగాడిని అని ప్రజలు ఆరోపించారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వారిని మీరు కనుగొనలేరు. నేను ఎల్లప్పుడూ నా సన్నిహితుల కోసం హృదయపూర్వకంగా ఆలోచిస్తా. నేను డిమాండ్ చేయను. నేను మాత్రమే ఇస్తా"అని చాహల్ చెప్పాడు.
తన పెంపకం గురించి వస్తున్న ఆరోపణలు ముఖ్యంగా బాధాకరమైనవని చాహల్ అన్నాడు. "నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారితో కలిసి పెరిగాను కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నా పేరు ఎవరితోనైనా ముడిపడి ఉన్నందున ప్రజలు తమ అభిప్రాయాల కోసం ఇష్టమొచ్చినట్లు ఏమీ రాయలేరు' అని చాహల్ తెలిపాడు.
చాహల్, ధనశ్రీ 2020 డిసెంబరులో సోషల్ మీడియాలో విస్తృతంగా కవర్ అయిన వేడుకలో వివాహం చేసుకున్నారు. అయితే వారి సంబంధం 2023 లో గందరగోళాన్ని ఎదుర్కొంది. చివరికి వారి విడిపోవడానికి దారితీసింది. అప్పటి నుండి ఇద్దరూ అప్పుడప్పుడు తమ అనుభవాల గురించి మాట్లాడుతున్నారు. ఆరోపణలు చేసుకుంటున్నారు.
సంబంధిత కథనం