OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే-dhamaka mission majnu and other movies and web series releasing on ott this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Jan 19, 2023 06:36 AM IST

OTT Releases This Week: స్టార్ హీరోహీరోయిన్లు న‌టించిన కొన్ని సినిమాలు ఈ వారం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకురానున్నాయి. ఆ సినిమాలు సిరీస్‌లు ఏవంటే…

ర‌వితేజ ధ‌మాకా
ర‌వితేజ ధ‌మాకా

OTT Releases This Week:

ర‌వితేజ ధ‌మాకా((Raviteja Dhamaka) - జ‌న‌వ‌రి 22 - నెట్‌ఫ్లిక్స్‌

ర‌వితేజ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ధ‌మాకా జ‌న‌వ‌రి 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ఆనంద్ చ‌క్ర‌వ‌ర్తి, స్వామి అనే యువ‌కులుగా డ్యూయ‌ల్ రోల్‌లో ర‌వితేజ న‌టించాడు.

త‌మ వ్యాపారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని అనుకున్న శ‌త్రువుల‌ను ఒకే రూపురేఖ‌ల‌తో ఉన్న ఇద్ద‌రు యువ‌కులు ఎలా ఎదుర్కొన్నార‌నే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. థియేట‌ర్ల‌లో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా ర‌వితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ధ‌మాకా సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

మిష‌న్ మ‌జ్ను(Mission Majnu) - జ‌న‌వ‌రి 20 - నెట్‌ఫ్లిక్స్‌

సిద్దార్థ్ మ‌ల్హోత్రా, ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) జంట‌గా న‌టించిన బాలీవుడ్ చిత్రం మిష‌న్ మ‌జ్ను థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా జ‌న‌వ‌రి 20న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు శంత‌న్ బాగ్చి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇండియా నిర్వ‌హించిన ముఖ్య‌మైన కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఏటీఎమ్ (తెలుగు వెబ్‌సిరీస్‌) - జ‌న‌వ‌రి 20 - జీ5

అగ్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సంయుక్తంగా క‌లిసి నిర్మిస్తోన్న ఏటీఎమ్ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ది. కోట్ల రూపాయ‌ల ఓ దొంగ‌త‌నం నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇందులో బిగ్‌బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ, దివి, సుబ్బ‌రాజు. దివ్య‌వాణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సిరీస్‌కు చంద్ర మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హ‌రీష్ శంక‌ర్ క‌థ‌ను అందించాడు.

ఛ‌త్రివాలీ (హిందీ) - జ‌న‌వ‌రి 20 - జీ5

ర‌కుల్‌ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh)ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఛ‌త్రివాలీ (Chhatriwali )సినిమా జీ5 ఓటీటీ ద్వారా జ‌న‌వ‌రి 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స‌మాజంలో సెక్స్ ఎడ్యుకేష‌న్ ప‌ట్ల నెల‌కొన్న అపోహ‌ల్ని చ‌ర్చిస్తూ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంది. తేజాస్ డియోస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.

డ్రైవ‌ర్ జ‌మున - జ‌న‌వ‌రి 20 - ఆహా త‌మిళ్‌ ఓటీటీ

కాప్పా - జ‌న‌వ‌రి 19 - నెట్‌ఫ్లిక్స్‌

ఝాన్సీ సీజ‌న్ 2 వెబ్ సిరీస్ - జ‌న‌వ‌రి 19 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

బ్ల‌డీ హార్ట్ సీజ‌న్ 1 - జ‌న‌వ‌రి 19 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

అల్కాలాత్ ప్ల‌స్ - నెట్‌ఫ్లిక్స్‌

జంగ్ ఈ - నెట్‌ఫ్లిక్స్‌

రిప్ర‌జెంట్ - నెట్‌ఫ్లిక్స్‌

వెయిటింగ్ ఫ‌ర్ యూ ఇన్ ది ఫ్యూచ‌ర్ - ఎమ్ఎక్స్ ప్లేయ‌ర్‌