తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రెజ్ అందుకుంది బ్యూటిపుల్ రీతు వర్మ. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతో సూపర్ హిట్ అందుకున్న రీతు వర్మ వరుడు కావలెను, టక్ జగదీశ్, స్వాగ్ వంటి సినిమాలతో అలరించింది. రీసెంట్‌గా సందీప్ కిషన్ మజాకా మూవీతో థియేటర్లలో సందడి చేసింది ముద్దుగుమ్మ రీతు వర్మ.
ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది రీతు వర్మ. తెలుగు హీరోయిన్ రీతు వర్మ నటించిన తొలి ఓటీటీ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. సూపర్ నాచురల్ రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన దేవిక అండ్ డానీ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ రీతు వర్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ.. "ఓటీటీ వెబ్ సిరీస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వస్తే చేద్దామనుకున్నాను. ఆ సమయంలో ‘దేవిక అండ్ డానీ’ వంటి నిజాయతీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు.
"ఇలాంటి ఓ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా సుధాకర్ గారికి థాంక్స్. ఆయన మంచి సినిమాలను, సిరీస్‌లను అందించాలనే ఉద్దేశంతో జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఇంకా ఇలాంటి సిరీస్‌లు, సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కిషోర్‌గారు చాలా సరదాగా ఉండే వ్యక్తి. ఫోకస్‌గా ఉంటారు" అని రీతు వర్మ తెలిపింది.
"వెంకట్ దిలీప్ గారు మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇప్పుడు స్క్రీన్‌పై చూస్తుంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతుంది. మా డానీ సూర్య ఎంతో హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా ఇన్‌వాల్వ్ అయ్యి నటించాడు. సుబ్బు పాత్రలో నటించిన శివ కందుకూరి తన పాత్రలో ఒదిగిపోయారు. సుబ్బరాజుగారు, కోవై సరళ గారు సహా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్" అని రీతు వర్మ పేర్కొంది.
"నందిని ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తనకు స్పెషల్ థాంక్స్. చాలా మంది అమ్మాయిలకు చుట్టు పక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ, అలాంటి వారికి (అమ్మాయిలకు) ఈ ఓటీటీ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. మా సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ జూన్6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ చూడండి" అని హీరోయిన్ రీతూ వర్మ తన స్పీచ్ ముగించింది.
సంబంధిత కథనం
టాపిక్