Devara OTT Release Date: అఫీషియల్.. జూనియర్ ఎన్టీఆర్ రూ.500 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Devara OTT Release Date: దేవర మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ మొత్తానికి మూవీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది.
Devara OTT Release Date: జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ దేవర ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై ఎన్నో వార్తలు రాగా.. ఇప్పుడు సదరు ఓటీటీయే అధికారికంగా అనౌన్స్ చేసింది.
దేవర ఓటీటీ రిలీజ్ డేట్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయకపోయినా.. ఆ ప్లాట్‌ఫామ్ లో దేవర మూవీని సెర్చ్ చేసినప్పుడు ఈ శుక్రవారం వస్తోందని స్పష్టంగా వెల్లడించింది.
థియేటర్లలో రిలీజ్ కు ముందే భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన దేవర.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర కూడా రూ.500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
దేవర మూవీ గురించి..
ఏదో ఒక బలమైన సామాజికాంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ హంగులు, ఎమోషన్స్‌తో సినిమా చేయడం కొరటాల శివ స్టైల్. కానీ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ మిస్సయింది. కథ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. కథలో నెక్స్ట్ ఏం జరుగబోతుందన్నది ఈజీగా గెస్ చేసేలా ఉంది. ట్విస్ట్‌లు కూడా సింపుల్‌గానే ఉన్నాయి. ఎన్టీఆర్, జాన్వీకపూర్ లవ్‌స్టోరీని సోసోగానే అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు మినహా మిగిలిన సన్నివేశాల్లో కొరటాల మార్కు ఎక్కడ కనిపించదు.
1996 వరల్డ్ కప్ బ్యాక్‌డ్రాప్‌లో కథను మొదలుపెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. నేరుగా కథను చూపించకుండా యతి అనే గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకోవడానికి శివం అనే పోలీస్ ఆఫీసర్ రత్నగిరి ప్రాంతానికి రావడం, అక్కడే సింగప్ప ద్వారా దేవర కథను చెప్పడం ఆకట్టుకుంటుంది.
దేవర, వర రెండు పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. భిన్న మనస్తత్వాలు కలిగిన పాత్రలు అతడు చూపించిన వేరియేషన్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. ఎన్టీఆర్‌పై షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు ధీటుగా సైఫ్ అలీఖాన్ విలనిజం సాగింది.
భైర పాత్రలో తనను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా సైఫ్ అలీఖాన్ నటించాడు. జాన్వీకపూర్ పాత్రకు పాటలు, కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైంది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ నటన ఓకే అనిపిస్తుంది. అనిరుధ్ బీజీఎమ్, చుట్టమల్లే పాట బాగున్నాయి.
దేవర ఓటీటీ రైట్స్
దేవర ఓటీటీ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 155 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా ఆఖరుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఇన్‌సైడ్ టాక్. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర సినిమాకు ఓటీటీ, శాటిలైట్, థియేటర్స్ అన్ని కలిపి రూ. 400 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.