Devara First Show: దేవర ఫస్ట్ షో టికెట్లు వచ్చేశాయి.. మొదలైన బుకింగ్స్.. పండగ చేసుకుంటున్న తారక్ ఫ్యాన్స్
Devara First Show: దేవర వరల్డ్ ప్రీమియర్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ తొలి షో యూకేలో ఉండనుంది. ఈ షోకి సంబంధించిన టికెట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Devara First Show: దేవర వరల్డ్ ప్రీమియర్ షో ఇండియాలో రిలీజ్ కంటే ఒక రోజు ముందే కానుంది. యూకేలోని పికాడిల్లీ సినీ మల్టీప్లెక్స్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫస్ట్ షో టికెట్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. వరల్డ్ ప్రీమియర్ మాత్రం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 26 రాత్రి 11.30 గంటలకే ఉండనుంది.
దేవర ప్రీమియర్ షో
సోమవారం (ఆగస్ట్ 26) రాత్రి నుంచే సోషల్ మీడియాలో దేవర మూవీ ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం ప్రీమియర్ షో బుకింగ్స్ ప్రారంభం కావడమే. యూకేలోని లీసెస్టర్ లో ఉన్న పికాడిలీ సినీలో బుకింగ్స్ ప్రారంభమైనట్లు మన్యు సినిమాస్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. యూకే కాలమానం ప్రకారం సెప్టెంబర్ 26 (గురువారం) రాత్రి 7 గంటలకు, 8.30 గంటలకు తెలుగు వెర్షన్ షోలు వేయనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభం కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
వాటిని బుక్ చేసుకున్న ఫ్యాన్స్ టికెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టికెట్ల బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే వెబ్‌సైట్ క్రాష్ అయిపోయిందని మరికొందరు వెల్లడించారు. గంటలోనే హౌజ్‌ఫుల్ బోర్డులు పెట్టేసినట్లు కూడా చెప్పారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండున్నరేళ్లకు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో దేవర క్రేజ్ మరింత పెరిగిపోయింది.
దేవర ఇండియా ప్రీమియర్ ఎప్పుడంటే?
ఇక దేవర మూవీ ఇండియా ప్రీమియర్ షో టైమ్ పైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈసారి తొలి షో అర్ధరాత్రి 1:08 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆకాశవాణి అనే ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసింది. దీనిపై మేకర్స్ నుంచి కూడా అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలిపింది. ఎప్పుడో 2022, మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ కాబోతోంది.
యూకేలోనే ప్రీమియర్ షోకు ఈ రేంజ్ క్రేజ్ ఉంటే.. ఇక ఇండియాలో పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. నిమిషాల్లోనే అక్కడ సైట్ క్రాష్ అయిపోయింది. మరి ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి మరో స్థాయిలో ఉండనుంది.
దేవర భైర గ్లింప్స్
ఇక దేవర నుంచి ఈ మధ్యే వచ్చిన భైర గ్లింప్స్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‍గా ఉంది. మల్లయోధుడిగా సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్‍గా, భీకరంగా కనిపించారు. ముందుగా ఆ ప్రాంతమంతా భైర (సైఫ్ అలీఖాన్) కనుసన్నల్లోనే ఉంటుందనేలా మేకర్స్ ఈ గ్లింప్స్‌లో చూపించారు. అక్కడి వారు భైర.. భైర అని అరుస్తుండగా.. అతడు మల్లయుద్ధానికి దిగుతాడు. పోటీకి వారిని మట్టికరిపిస్తాడు. అతడికి ఓ సైన్యమే ఉంటుందని ఈ గ్లింప్స్‌లో అర్థమవుతోంది.
మొత్తంగా దేవరలో సైఫ్ అలీ ఖాన్ బలమైన విలన్‍గా ఉంటాడనేది అర్థమవుతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. విలన్ ఎంత పటిష్టంగా ఉంటే.. హీరో అంత ఎలివేట్ అవుతాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్లింప్స్‌కు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ అయింది.