Devara First Review: ఎన్టీఆర్ దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సెకండాఫ్ ఊరమాస్ - ఫ్యాన్స్‌కు పూనకాలే!
Devara First Review:ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఎన్టీఆర్ సన్నిహితులు కొందరు దేవర మూవీని చూసినట్లు సమాచారం. ఊరమాస్ స్టోరీతో దేవర ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని వారు కామెంట్స్ చేసినట్లు తెలిసింది.
Devara First Review: ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దేవర మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు.
స్పెషల్ ప్రీమియర్...
ఇటీవల దేవర మూవీని ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీతో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ సన్నిహితులు చూసినట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రీమియర్‌కు పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలిసింది. దేవర మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయినట్లు సమాచారం.
సెకండాఫ్ ఊరమాస్‌గా సినిమా సాగుతుందని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియెన్స్‌కు దేవర పూనకాలు తెప్పించడం ఖాయమని ప్రీమియర్‌కు వచ్చిన వారు కామెంట్స్ చేసినట్లు తెలిసింది. యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడని, అతడి హీరోయిజం, ఎలివేషన్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని ప్రీమియర్ చూసిన వారు చెప్పినట్లు సమాచారం.
1200 థియేటర్లలో...
దేవర మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1200లకుపైగా థియేటర్లలో రిలీజ్ అవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళ్, మలయాళంతో పాటు ఇతర భాషల్లో దేవర ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొనడంతో ఆయన భాషల్లో సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది.
ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ వంద కోట్లు, తెలుగులో యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పడం ఖాయమని అంటోన్నారు. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా దుమ్మురేపుతోంది. రిలీజ్‌కు వారం ముందే పన్నెండు కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
పెరిగిన టికెల్ ధరలు...
మరోవైపు ఏపీ, తెలంగాణ లో దేవర మూవీ టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఏపీలో మల్టీప్లెక్స్‌లలో 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 110, 60 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదనపు షోలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిలీజ్ రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు ప్రతి రోజు ఆరు షోలతో సినిమాను ప్రదర్శించవచ్చని ఈ జీవోలో పేర్కొన్నది.
జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ...
దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకోతో పాటు దక్షిణాదికి భాషలకు చెందిన పలువురు నటీనటులు కనిపించబోతున్నారు. దేవర మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (నేడు) హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకకు రాజమౌళి, త్రివిక్రమ్‌తో పాటు ప్రశాంత్ నీల్ గెస్ట్‌లుగా రానున్నట్లు సమాచారం.
దేవర మూవీ రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోంది. తొలి పార్ట్ బడ్జెట్ మూడు వందల కోట్లుగా ప్రచారం జరుగుతోంది. దేవర కంటే ముందు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది.