Fear Song: ఐదు రోజుల్లోనే గేమ్ ఛేంజర్ జరగండి పాటను దాటేసిన ఫియర్ సాంగ్.. హిందీలో పది రెట్లు!
Fear Song vs Jaragandi: దేవర నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ దుమ్మురేపుతోంది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. ఈ క్రమంలో ‘జరగండి’ పాట తెలుగు వెర్షన్‍ను ఐదు రోజుల్లోనే దాటేసింది దేవర పాట.
Fear Song vs Jaragandi: గేమ్ ఛేంజర్, దేవర సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు గ్లోబల్ రేంజ్‍లో క్రేజ్ వచ్చేసింది. ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీని చరణ్ చేస్తుంటే.. కొరటాల శివ డైరెక్షన్‍లో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి తొలి సాంగ్స్ వచ్చేశాయి. అయితే, ఫస్ట్ పాట విషయంలో దేవర ఫియర్ సాంగ్ ఐదు రోజుల్లోనే పైచేయి సాధించేసింది.
ఫియర్ సాంగ్ వర్సెస్ జరగండి ఇలా..
రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ‘జరగండి’ పాట వచ్చింది. ఈ పాటకు మాస్ బీట్‍తో ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. డైరెక్టర్ శంకర్ గ్రాండ్‍నెస్ లిరికల్ వీడియోలో కనిపించింది. రామ్‍చరణ్‍తో పాటు హీరోయిన్ కియారా అడ్వానీ కూడా డ్యాన్స్ అదరగొట్టారు. అయితే, ఈ జరగండి పాట అనుకున్న స్థాయిలో సూపర్ సక్సెస్ కాలేకపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) సందర్భంగా ఒక్కరోజు ముందు అంటే గత వారమే మే 19న దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ వచ్చింది. అనిరుధ్ రవిచందర్ ఈ పాటను తన మార్క్ బీట్‍తో అదరొగొట్టారు. రామజోగయ్య అందిందిన లిరిక్స్ కూడా పవర్‌ఫుల్‍గా సాగాయి. మ్యూజికల్ వీడియోలో ఎన్టీఆర్ యాక్షన్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఫియర్ సాంగ్ దుమ్మురేపుతోంది.
జరగండిని దాటేసిన ఫియర్ సాంగ్
గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన జరగండి పాట తెలుగు వెర్షన్‍కు యూట్యూబ్‍లో ఇప్పటి వరకు (మే 25) దాదాపు 31.15 మిలియన్ (3.11 కోట్లు) వ్యూస్ వచ్చాయి. అయితే, దేవర నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ ఐదు రోజుల్లోనే ఇప్పటి వరకు 31.40 మిలియన్ (3.14కోట్లు) వ్యూస్ క్రాస్ అయింది. దీంతో జరగండి తెలుగు వెర్షన్‍ను దేవర పాట ఐదు రోజుల్లోనే దాటేసింది. ఈ ఫియర్ సాంగ్ ఇంకా జోరు చూపిస్తోంది. ఇప్పటికీ ట్రెండింగ్‍లో కొనసాగుతోంది. దీంతో ఈ పాట భారీ వ్యూస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిందీలో భారీగా..
హిందీ వెర్షన్‍లో జరగండితో పోలిస్తే ఫియర్ సాంగ్‍కు ఇప్పటి వరకు భారీగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‍లో జరగండి లిరికల్ హిందీ సాంగ్‍కు ఇప్పటి వరకు సుమారు 1.7 మిలియన్ (17 లక్షలు) వ్యూస్ దక్కాయి. ఫియర్ సాంగ్ హిందీ వెర్షన్ యూట్యూబ్‍లో ఇప్పటికే 18 మిలియన్ (1.8 కోట్లు) వ్యూస్ దాటేసింది. హిందీలోనూ దేవర సాంగ్ దూకుడు చూపిస్తోంది. జరగండి సాంగ్ హిందీ వెర్షన్‍తో పోలిస్తే ఫియర్ సాంగ్ హిందీలో ఇప్పటికే 10 రెట్లు ఎక్కువగా వ్యూస్ దక్కించుకుంది.
దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. అయితే, గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
టాపిక్