Devara fear song promo: జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. ఈ సాంగ్ శనివారం (మే 19) రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు తారక్ ప్రోమో రిలీజ్ చేశాడు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఈ పాటను కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశాడు. అదిరిపోయే బీజీఎంతో ఈ ప్రోమో ఆకట్టుకుంది.
దేవర మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన 41వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. అయితే దానికి ఒక రోజు ముందే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఈ సాంగ్ ప్రోమోను శుక్రవారం (మే 17) తారక్ రిలీజ్ చేశాడు. కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో అనిరుధ్ రవిచందర్ కూడా కనిపించడం విశేషం.
ఇక జూనియర్ ఎన్టీఆర్ రెండు ఫ్రేమ్ లలో కనిపిస్తున్నాడు. స్టైలిష్ లుక్ లో బోటులో వస్తున్న సీన్ కూడా ఇందులో ఉంది. అయితే ఈ ప్రోమో బీజీఎం అదిరిపోవడంతో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెరిగిపోయాయి. గతేడాది జైలర్, లియోలాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన అనిరుధ్ నుంచి తారక్ అభిమానులు చాలా ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
గతేడాది జైలర్ మూవీలో రజనీకాంత్ కు హుకుమ్ సాంగ్ ఇచ్చాడు అనిరుధ్. రజనీ కెరీర్లో ఓ బెంచ్ మార్క్ లా నిలిచిపోయే సాంగ్ అది. అయితే ఇప్పుడు దేవరలో ఫియర్ సాంగ్ దానిని మించిపోయేలా ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పడం విశేషం. దీంతో సాంగ్ రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ ను అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అనిరుధ్ ఈ మధ్య కాలంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ చేస్తున్నాడు.
ప్రస్తుతం తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అతడే. అలాంటి కంపోజర్ నుంచి వస్తున్న సాంగ్ కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. ఓ భిన్నమైన అనుభూతిని పంచే పాట కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రోమో చూస్తుంటే ఈ సాంగ్ ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకూ చూడని విధంగానే ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
దేవర మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. అప్పుడు కూడా వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చినా.. ఈ ఫియర్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో మరోసారి రిలీజ్ డేట్ ను స్పష్టంగా చెప్పారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఈ దేవరతోపాటు బాలీవుడ్ లో వార్ 2 కూడా చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈసారి అతడు తన బర్త్ డే వేడుకలను ముంబైలోనే జరుపుకోనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.