Janhvi Kapoor boyfriend: అవును.. నా బాయ్‌ఫ్రెండ్ అతడే.. నెక్లెస్‌తో కన్ఫమ్ చేసిన దేవర బ్యూటీ
Janhvi Kapoor boyfriend: దేవర బ్యూటీ జాన్వీ కపూర్ మొత్తానికి తన బాయ్‌ఫ్రెండ్ అతడే అని చెప్పేసింది. తాజాగా ఓ ఈవెంట్లో తాను ధరించిన నెక్లెస్ ద్వారా ఈ విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది.
Janhvi Kapoor boyfriend: జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సస్పెన్స్ కు తెరదించింది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నట్లు భావిస్తున్న వ్యక్తి శిఖర్ పహారియానే తన బాయ్‌ఫ్రెండ్ అని కన్ఫమ్ చేసింది. అయితే ఆమె నేరుగా చెప్పకపోయినా.. మెడలో ధరించిన నెక్లెస్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడం విశేషం.
జాన్వీ బాయ్‌ఫ్రెండ్ అతడే..
జాన్వీ కపూర్ చాలా కాలంగా శిఖర్ పహారియాతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. అయితే అతడే తన బాయ్ ఫ్రెండ్ అని గానీ, డేటింగ్ చేస్తున్నట్లుగానీ ఎప్పుడూ చెప్పలేదు. ఈ మధ్యే ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా శిఖర్ గురించి నేరుగా స్పందించాడు. అయితే తాజాగా జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ అతడే అని కన్ఫమ్ చేసింది.
ముంబైలో జరిగిన మైదాన్ మూవీ స్క్రీనింగ్ కు జాన్వీ వచ్చింది. ఎప్పటిలాగే తన క్యూట్ లుక్స్ తో ఆమె ఆకర్షించింది. అయితే ఈసారి మాత్రం అందరి చూపు ఆమె అందం కంటే ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్ పైనే నిలిచాయి. ఎందుకంటే ఆ నెక్లెస్ పై శిఖర్ పేరు ఉండటం. జాన్వీ తనకు తానుగా చెప్పకపోయినా.. ఇప్పుడిలా నెక్లెస్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించినట్లయింది.
ఆ నెక్లెస్ పై శిఖు అని రాసి ఉంది. తన బాయ్ ఫ్రెండ్ ను ఆమె ముద్దుగా అలా పిలుచుకుంటుందన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అజయ్ దేవగన్ నటించిన మైదాన్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జాన్వీ పూర్తి వైట్ డ్రెస్ లో వచ్చింది. ఆమె తండ్రి బోనీ కపూరే ఈ సినిమాను నిర్మించాడు.
ఈ మధ్యే అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు కూడా జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతోనే కలిసి వెళ్లింది. అటు ఆమె చెల్లి ఖుషీ కపూర్ కూడా తన బాయ్ ఫ్రెండ్ వేదాంగ్ రైనాతో కలిసి రావడం విశేషం. ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు వాళ్ల చేతుల్లో చేయి వేసి వెళ్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.
మామకు నచ్చిన అల్లుడు
జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ స్పందించాడు. శిఖర్ చాలా మంచి వ్యక్తి అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. "అతడంటే నాకు ఇష్టం. నిజానికి రెండేళ్ల కిందట అతనితో జాన్వీ కలవడం మానేసినా కూడా నాతో మాత్రం ఫ్రెండ్లీగానే ఉన్నాడు. అతడెప్పుడూ జాన్వీకి ఎక్స్ గా ఉండడు అని నాకు అప్పుడే అనిపించింది"అని బోనీ చెప్పాడు.
దివంగత శ్రీదేవి ముద్దుల తనయ అయిన జాన్వీ తన తల్లి మాతృభాష తెలుగు వైపు చూస్తోంది. రెండు పెద్ద సినిమాల్లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేవర షూటింగ్ దాదాపు పూర్తి కానుండగా.. ఈ మధ్యే ఆర్సీ16లో రామ్ చరణ్ సరసన్ కూడా జాన్వీయే కన్ఫమ్ అయింది. బుచ్చిబాబు సానా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.