Jr NTR New Car: ఆర్‌టీవో ఆఫీస్‍కు వెళ్లిన ఎన్టీఆర్: కొత్తగా ఏ కారు తీసుకున్నారంటే..-devara actor jr ntr visits rto office in hyderabad for register his newmercedes benz maybach car ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr New Car: ఆర్‌టీవో ఆఫీస్‍కు వెళ్లిన ఎన్టీఆర్: కొత్తగా ఏ కారు తీసుకున్నారంటే..

Jr NTR New Car: ఆర్‌టీవో ఆఫీస్‍కు వెళ్లిన ఎన్టీఆర్: కొత్తగా ఏ కారు తీసుకున్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 02, 2024 04:27 PM IST

Jr NTR New Car: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఖైరతాబాద్‍లోని ఆర్‌టీవో ఆఫీస్‍లో కనిపించారు. తాను కొత్తగా కొనుగోలు చేసి కారుకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లారు. ఆయన కొత్త కారు ఏదంటే..

Jr NTR New Car: ఆర్‌టీవో ఆఫీస్‍కు వెళ్లిన ఎన్టీఆర్: కొత్తగా ఏ కారు తీసుకున్నారంటే.. (Photo: X)
Jr NTR New Car: ఆర్‌టీవో ఆఫీస్‍కు వెళ్లిన ఎన్టీఆర్: కొత్తగా ఏ కారు తీసుకున్నారంటే.. (Photo: X)

Jr NTR New Car: మ్యాన్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, జూనియర్ ఎన్టీఆర్ నేడు (ఏప్రిల్ 2) హైదరాబాద్‍లోని ఖైరతాబాద్ ఆర్‌టీవో ఆఫీస్‍లో కనిపించారు.

తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం నేడు ఎన్టీఆర్.. ఖైరతాబాద్ ఆర్‌టీవో కార్యాలయానికి వెళ్లారు. బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి సింపుల్‍గా స్టైలిష్‍గా కనిపించారు ఎన్టీఆర్. బ్లాక్ సన్‍గ్లాసెస్ కూడా పెట్టున్నారు.

ఆర్‌టీవో ఆఫీస్ నుంచి బయటికి వస్తుండగా కెమెరాలకు చిక్కారు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొత్త కారు ఇదే.. ధర ఎంతంటే..

ఎన్టీఆర్ కొత్తగా ‘మెర్సెడెస్ బెంజ్ మేబాచ్ ఎస్-క్లాసిక్ ఎస్580’ లగ్జరీ ప్రీమియం కారును కొనుగోలు చేశారు. ఈ కారులోనే ఆర్టీవో కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ప్రీమియమ్ ఎస్‍యూవీ కారు ప్రారంభ ధర రూ.2.8 కోట్లుగా ఉంది.

మెర్సెడెస్ బెంజ్ మేబాచ్ ఎస్-క్లాసిక్ ఎస్580 కారులో 3982 సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటుంది. 496.17 బీహెచ్‍పీ వరకు గరిష్ఠ పవర్ ఉంటుంది. ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్ 9-స్పీడ్ గేర్ బాక్సుతో ఈ కారు వస్తోంది. ఈ కారు గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. కేవలం 4.8 సెకన్లలోనే 0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగానికి యాక్సలేట్ అవుతుంది. ఈ కారులో అన్ని ప్రీమియం, లగ్జరీ ఫీచర్లు ఉంటాయి.

దేవర గురించి..

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో జాన్వీ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా నటిస్తుండగా.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలకపాత్ర పోషిస్తున్నారు.

జనవరిలో వచ్చిన దేవర గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. సముద్రం బ్యాక్‍డ్రాప్, ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ సహా అన్నీ అంశాలు అదిరిపోవటంతో చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. దర్శకుడు కొరటాల శివ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్ కూడా ఎక్కువగానే ఉండనుంది. అండర్ వాటర్ యాక్షన్ సీన్లు కూడా ఉండనున్నాయి.

దేవర చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువకుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రత్నవేలు ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇటీవలే గోవాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది దేవర.

దేవర సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే, అది సాధ్యం కాలేదు. దీంతో దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.